ఎయిర్‌టెల్ డిజిటల్ TV HD STBని కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప తగ్గింపు ఆఫర్
ఇండియాలోని టెలికాం రంగంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న భారతి ఎయిర్‌టెల్ డైరెక్ట్-టు-హోమ్ (DTH) రంగంలో కూడా అద్భుతమైన సేవలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఎయిర్‌టెల్ DTH సర్వీస్ ఆర్మ్ ఎయిర్‌టెల్ డిజిటల్ TV ఇప్పుడు దాని సెట్-టాప్ బాక్స్ (STB)ని కేవలం రూ.1,500కే అందిస్తోంది. అయితే వినియోగదారుడు కంపెనీ నుండి కొత్త STBని కొనుగోలు చేసినప్పుడు చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉండేది కాదు. వినియోగదారులు STBని యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే ఛానెల్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. కాబట్టి కంపెనీ వినియోగదారులు STB కోసం చెల్లించేటప్పుడు ఛానెల్ ప్యాక్‌ను కొనుగోలు చేయడానికి కూడా అనుమతిస్తుంది. అంతేకాకుండా Airtel Digital TV వినియోగదారులు HD STBని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే వారికి 10% తగ్గింపును అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ డిజిటల్ TV HD STB ధర వివరాలు
ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విభాగంలో ఇప్పుడు HD బాక్స్ ను ఆఫర్ కింద రూ.1692 ధర వద్ద కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం అందిస్తోంది. అదనంగా ఇందులో 10% తగ్గింపు కూడా ఉంటుంది. STB అసలు ధర రూ.1500. దాని పైన మీరు నెలకు రూ.356 ధర వద్ద లభించే ఛానెల్ ప్యాక్‌ని జోడించవచ్చు. ఈ ఛానెల్ ప్యాక్ 132 ఛానెల్‌లతో లభిస్తుంది. రూ.356 ధరలో రూ.153 నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్) కూడా ఉంది. కాబట్టి ప్లాన్ మొత్తం ఖర్చు రూ.1500 + రూ.356 అవుతుంది. అంటే రూ.1856 అన్న మాట. అయితే 10% తగ్గింపును వర్తింపజేసిన తర్వాత దీని ధర రూ.1,692 తగ్గింపుతో లభిస్తుంది. ఇంకా కంపెనీ రూ.100 విలువైన 1-సంవత్సరం వారంటీని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ డిజిటల్ TV HD STB ఫీచర్లు
ఎయిర్‌టెల్ డిజిటల్ TV HD STBతో మీరు పొందగలిగే ప్రయోజనాల విషయానికి వస్తే ఇందులో మీరు HD ఛానెల్‌లను వీక్షించగలరు. అదే సమయంలో HD STB డాల్బీ డిజిటల్ సౌండ్‌ను ఎనేబుల్ చేస్తుంది. ఇది పూర్తిగా మెరుగైన వీక్షణ అనుభవాన్ని పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారులు తమకు ఇష్టమైన కంటెంట్‌ను రికార్డ్ చేసి తర్వాత ప్లే చేసుకోవచ్చు. మీరు మరింత మెరుగైన ఎంపిక కోసం వెళ్లాలనుకుంటే మరియు ఖర్చు చేయడానికి అదనపు సామర్థ్యాన్ని కలిగి ఉండాలనుకుంటే మీరు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క ఆండ్రాయిడ్ STB ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు మూడు అప్‌గ్రేడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.3049 ధర వద్ద ఉండగా మిగిలిన ప్లాన్‌లు రూ.2999 మరియు రూ.2949 ధరల వద్ద లభిస్తాయి. రూ.3049 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ZEE5 ప్రీమియం మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కంపెనీ నుండి Xstream బాక్స్‌ను పొందుతారు. ఇంకా రూ. 2999 ప్లాన్‌తో Xstream బాక్స్‌ని పొందుతారు. అలాగే ఒక సంవత్సరం పాటు Amazon Prime వీడియో యొక్క OTT ప్రయోజనంను ఉచితంగా పొందుతారు. చివరగా రూ.2949 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా Xstream బాక్స్‌ను పొందుతారు. కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ కోసం మీరు రూ.250 అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది ఆండ్రాయిడ్ ఎస్‌టిబి కాబట్టి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి 5 వేలకు పైగా అప్లికేషన్‌లను సౌకర్యవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. ఈ ఎస్‌టిబి గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారులకు టివికి వాయిస్ కమాండ్‌లను ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఈ STB గురించి ఉత్తమమైన విషయాలలో ఒకటి ఇది 4K కంటెంట్‌కు మద్దతు ఇవ్వగలదు. కాబట్టి మీకు ఇష్టమైన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల నుండి మీకు ఇష్టమైన షోలను నేరుగా టీవీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.


Click it and Unblock the Notifications