రూ. 7 నుంచే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ప్లాన్లు ప్రారంభం
కేబుల్ టీవి అలాగే డిజిడిల్ టివి వినియోగదారులు ఇప్పుడు టీవీ సబ్ స్క్రిప్సన్ బిల్లుతో అనేక రకాలైన సమస్యలను ఎదుర్కుంటున్నారు.కాగా ట్రాయ్ ఈ మధ్య కొత్తగా సవరించిన టవీ వ్యూయింగ్ బిల్లుతో కూడా ఇతర సమస్యలు వస
కేబుల్ టీవి అలాగే డిజిడిల్ టివి వినియోగదారులు ఇప్పుడు టీవీ సబ్ స్క్రిప్సన్ బిల్లుతో అనేక రకాలైన సమస్యలను ఎదుర్కుంటున్నారు.కాగా ట్రాయ్ ఈ మధ్య కొత్తగా సవరించిన టవీ వ్యూయింగ్ బిల్లుతో కూడా ఇతర సమస్యలు వస్తున్నాయి. ఈ దెబ్బకు వినియోగదారులు తమ బిల్లును ఎలా తగ్గించుకోవాలనే దానిపైనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని డీటీహెచ్ కంపెనీలు తమ ప్లాన్లను వినియోగదారులకు పరిచయం చేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడా తమ ప్లాన్ల లిస్టును విడుదల చేసింది.

ఈ కంపెనీ ప్లాన్లు రూ.7 నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ యాడ్ ఆన్ ప్యాక్స్ కంపెనీ వెబ్ సైట్ ద్వారా కాని లేక ఎయిర్‌టెల్ యాప్ ద్వారా కాని యాక్టివేట్ చేసుకోవచ్చు

ఎయిర్‌టెల్ రీజనల్ టాప్ అప్స్
ఎయిర్‌టెల్ కంపెనీ దాదాపు 13 రీజనల్ టాప్ అప్ ప్లాన్లను చాలా భాషల్లో ప్రవేశపెట్టింది. ఈ లిస్టులో ప్రధమ స్థానంలో ఉన్న బెంగాలి రీజనల్ టాప్ ప్లాన్ రూ.67 నుంచి ప్రారంభం అవుతుంది. మిని ప్యాక్ అయితే రూ.47 నుంచి ప్రారంభం అవుతుంది. గుజరాతిలో టాప్ అప్ ప్లాన్ రూ.7 నుంచి మొదలవుతోంది. కన్నడ విషయానికొస్తే టాప్ అప్ రూ.114 మిని టాప్ అప్ రూ.86 నుంచి ప్రారంభం అవుతుంది.

మళయాలం, తెలుగు
ఇక మళయాలం విషయానికి వస్తే Malayalam regional, Mini Malayalam regional, Marathi regional, Mini Malayalam regional ధరలు వరుసగా రూ.84, రూ.54,రూ.53, రూ. 45గా ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే రీజనల్ టాప అప్ రూ.135నుంచి ప్రారంభం అవుతోంది. మిని అయితే రూ.83 నుంచి మొదలవుతుంది. తమిళ్ వరుసగా రూ.11, మిని తమిళ్ రూ.71గా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి
ఇందులో భాగంగా తమిళంలో బండిల్ ఆఫర్స్తో వస్తున్నాయి. మిని తమిళ్ యాక్టివేట్ చేసుకుంటే రూ. 71కి Sun TV, Chutti TV, Sun News, Star Vijay, Zee Tamizh, Raj Musix Tamil, Jaya Plus, Adithya and New18 తమిళ ఛానల్స్ వస్తాయి.

సబ్ స్క్రైబర్స్
కాగా Hindi, English Sports and New Channelsకి దాదాపు 15 మిల్లియన్ల మంది యూజర్లు ఉన్నారు.వీటికి కంపెనీ సపరేట్ గా ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లలో ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ట్రాయ్ కొత్త రూల్స్
ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం NCF charges రూ.153 వరకు ఉన్నాయి. దీనికి అదనంగా మీరు ఛానల్ యాక్టివేట్ చేసుకునే దాన్ని బట్టి చెల్లించాల్సి ఉంటుంది. నెలకు మొత్తం రూ.288 వరకు బిల్లు అవుతోంది.


Click it and Unblock the Notifications








