Home
News

Airtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు

డిటిహెచ్ పరిశ్రమలో కొంతమంది ఆపరేటర్లు చందాదారుల దృష్టిని ఆకట్టుకోవడనికి వివిధ రకాల ప్లాన్ లను ప్రవేశపెడుతు ఉంటారు. కొత్త ట్రాయ్ టారిఫ్ పాలన అమలులోకి వచ్చినప్పటి నుండి ఆపరేటర్లు చందాదారులను ఆకర్షించడానికి వినూత్న విధానాలను అవలంబిస్తూ కొత్త రకం పోటీకి తెరలేపారు. డిటిహెచ్ ఆపరేటర్లు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త రకం ఆఫర్లలో డిస్కౌంట్లు, ఛానల్ ప్యాక్‌లను రూపొందిస్తున్నారు.

భారతి ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ యొక్క డిటిహెచ్ ఆర్మ్ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తన వినియోగదారులకు చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తోంది. ప్రత్యేకించి దీర్ఘకాలిక ప్యాక్‌ల విషయానికి వస్తే అద్భుతమైన డిస్కౌంట్ లను అందిస్తోంది. ఇతర DTH ఆపరేటర్ల నుండి ఇతర సమర్పణలు దీనికి పోటీగా కనిపిస్తున్నప్పటికీ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ లాంగ్ టర్మ్ ప్లాన్ ల విషయంలో గొప్పగా ఉంది.

 

వార్షిక ప్యాక్‌ల

కస్టమర్ల కోసం వార్షిక ప్యాక్‌లను అందించేటప్పుడు DTH ఆపరేటర్లు చందాదారుల కోసం చాలా ఎంపికలను అందిస్తూఉంటారు. చందాదారులు సంవత్సరానికి మరియు ఆరు నెలలకు మరియు మూడు నెలలకు వివిధ విభాగాలలో పొందగలిగే ఈ ప్యాక్‌ల యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వార్షిక మరియు సెమీ వార్షిక ప్యాక్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వార్షిక మరియు సెమీ వార్షిక ప్యాక్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ అందిస్తున్న ప్యాక్‌ల జాబితాలో ప్రసిద్ధమైన ప్యాక్‌లలో ఒకటి దబాంగ్ ప్యాక్. ఈ దబాంగ్ ప్యాక్ వివిధ ఎంపికలు మరియు వివిధ సమయ ఫ్రేములలో లభిస్తుంది. దబాంగ్ ప్యాక్ మూడు నెలలకు లేదా ఆరు నెలల చందా కోసం అందుబాటులో ఉండగా కొన్ని సంవత్సరం చందా కోసం కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మీరు అప్పుడు దబాంగ్ హెచ్‌డి 12M ప్యాక్‌ విషయానికి వస్తే ఇది ఒక సంవత్సరం చందా ధర రూ.3,264. అలాగే పన్నులతో కలిపి దీనికి అయే మొత్తం ఖర్చు రూ.3,851. ఇది HD ప్యాక్ కాబట్టి ఇందులో AAJ TAK HD, & TV HD, అనిమల్ ప్లానెట్ వరల్డ్ HD వంటి మరిన్ని ఛానెల్‌లు ఉంటాయి. అదే తరహాలో దబాంగ్ HD 6M ప్లాన్ కూడా ఉంది. ఇది దీని పేరుకు సూచించినట్లు ఆరు నెలల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్యాక్ ధర అన్ని రకాల పన్నులతో కలిపి 2,101 రూపాయలు.

 

దీర్ఘకాలిక ప్యాక్‌లపై డిస్కౌంట్

దీర్ఘకాలిక ప్యాక్‌లపై డిస్కౌంట్

పైన తెలిపిన రెండు ప్యాక్‌ల యొక్క నెల వారి ధర విషయానికి వస్తే దీని ధర రూ.272 గా ఉంటుంది. అయితే 6 నెలల ప్యాక్‌ను ఎంచుకుంటే కనుక దీని మీద సుమారు 297 రూపాయలు తగ్గింపు లభిస్తుంది. అందువల్ల ఎయిర్‌టెల్ డిజిటల్ టివి కూడా వార్షిక ప్యాక్‌లపై కొంత తగ్గింపు ఇస్తుందని చెప్పవచ్చు.

 

పోర్ట్‌ఫోలియో

ఎయిర్టెల్ డిజిటల్ టివి లాంగ్ టర్మ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోలో చాలా ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లు ఉన్నాయి. ఉదాహరణకు AP మెగా HD 12M ప్యాక్ ఒక సంవత్సరానికి రూ.7,811 ధర వద్ద లభిస్తుంది. అలాగే AP మెగా హెచ్‌డి 3M ప్యాక్ రూ.2,131లకు అలాగే 6 నెలల వెర్షన్‌తో వస్తున్న ప్యాక్ ను రూ.4,261 ధర వద్ద పొందవచ్చు.ఇందులో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటే చానెల్స్ మరియు ఛానల్ ప్యాక్ లలో SD వేరియంట్ కోసం వెళ్ళడం ఉత్తమం. ఇందులో రూ.3,121 ధర వద్ద AP మెగాSD 6M ప్యాక్ లభిస్తుంది. ఇంకా తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ చందాదారుల కోసం AP మై ఫ్యామిలీ ప్యాక్ లభిస్తుంది. ఇది 12 నెలల చందా కోసం 6,512 రూపాయలకు లభిస్తుంది.

అదనపు రోజుల సర్వీస్

అదనపు రోజుల సర్వీస్

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి పోర్ట్‌ఫోలియోలో గమనించదగ్గ మరొక విషయం ఏమిటంటే AP మై ఫ్యామిలీ హెచ్‌డి 3M ప్లాన్ వంటివి మూడు నెలలకు ఎంచుకుంటే కనుక సాధారణ చందాతో పాటుగా మరొక 7 రోజుల అదనపు సర్వీస్ యాక్సిస్ ను పొందవచ్చు. కాబట్టి మూడు నెలల రీఛార్జ్ ద్వారా చందాదారులకు అదనంగా 7 రోజులు యాక్సిస్ లభిస్తాయి. అలాగే ఆరు నెలలకు రీఛార్జ్ చేసినచో 15రోజులు అదనంగా యాక్సిస్ పొందవచ్చు. అలాగే ఒక సంవత్సరానికి రీఛార్జ్ ద్వారా అదనంగా మరొక నెల అంటే 30రోజులు యాక్సిస్ ఉచితంగా లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Digital TV Long Term Recharge Plans Offers Extra Days and Discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X