JEE & NEET విద్యార్థుల కోసం ఉచితంగా రెండు చానెలను అందిస్తున్న Airtel Digital TV

|

ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లలో అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న వారిలో ఒకటైన ఎయిర్టెల్ డిజిటల్ టివి జెఇఇ మరియు నీట్ విద్యార్థులకు సహాయం చేయడానికి కొత్తగా రెండు ఛానెళ్లను తన ప్లాట్‌ఫామ్‌లో జోడించింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ జోడించిన రెండు ఎడ్యుకేషన్ ఛానెళ్లలో JEE విద్యార్థుల కోసం 'ఆకాష్ ఎడ్యుటీవీ' మరియు NEET విద్యార్థుల కోసం 'ఆకాష్ ఎడుటివి' చానెలను అందిస్తున్నది. ఇవి ప్రస్తుతం ఇంటి వద్ద నుండి చదువుకుంటున్న విద్యార్థులు JEE, NEET పరీక్షలకు సన్నధం అవ్వడానికి సహాయపడతాయి. ఈ రెండు ఛానెల్‌లు ప్రస్తుతం చందాదారులకు ఉచితంగా అందించబడుతున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్తగా చేర్చిన ఎడ్యుకేషన్ ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్తగా చేర్చిన ఎడ్యుకేషన్ ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో ఆకాష్ ఛానెళ్ల ద్వారా JEE మరియు NEET వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి అవసరమైన కంటెంట్ తో కూడిన వీడియోలను ఇందులో ప్రసారం చేస్తాయి. ‘ఆకాష్ ఎడ్యుటీవీ-జెఇఇ' జెఇఇ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులపై దృష్టి సారించే కంటెంట్‌ను తీసుకువస్తుంది. అదేవిధంగా ‘ఆకాష్ ఎడ్యుటీవీ-నీట్' అనే ఛానెల్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులపై దృష్టి సారించే కంటెంట్‌ను కలిగి ఉంటుంది.

 

Also Read: Amazon, Flipkart saleలో AC,టీవీలను కొంటున్నారా!!! ఇవి గుర్తుంచుకోండి...Also Read: Amazon, Flipkart saleలో AC,టీవీలను కొంటున్నారా!!! ఇవి గుర్తుంచుకోండి...

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఎడ్యుకేషన్ ఛానెల్‌ల ధరలు & నంబర్లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఎడ్యుకేషన్ ఛానెల్‌ల ధరలు & నంబర్లు

JEE మరియు NEET పరీక్షల కంటెంట్ తో వచ్చే ఈ రెండు ఛానెల్‌లను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అక్టోబర్ 21 2020 వరకు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన ప్లాట్‌ఫామ్‌లలో చందాదారులకు అందిస్తున్నారు. అయితే ఉచిత ట్రయల్ ముగిసిన తర్వాత ఈ రెండు ఛానెల్‌లకు నెలకు రూ.246 ధర వద్ద కొనుగోలు చేయవలసి ఉంటుంది. అలాగే ఆరు నెలల చెల్లుబాటుకు రూ.1231 ధర వద్ద మరియు 12 నెలల చెల్లుబాటు కోసం రూ.2214 ఖర్చు చేయవలసి ఉంటుంది. ‘ఆకాష్ ఎడ్యుటీవీ-జెఇఇ' ఛానల్ నంబర్ 467 కాగా, ‘ఆకాష్ ఎడుటీవీ-నీట్' ఛానల్ నంబర్ 478 వద్ద లభిస్తుంది.

ఆకాష్ ఎడుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ - ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఆకాష్ ఎడుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ - ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఆకాష్ ఎడుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (AEPL) అనేది JEE మరియు NEET వంటి పోటీ పరీక్షల కోసం దేశం అంతటా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే AEPL అనేది విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం కోసం రికార్డ్ చేసిన వీడియో తరగతులతో పాటుగా ఆన్‌లైన్ లైవ్ తరగతులను కూడా అందిస్తుంది. ఆకాష్ మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీల మధ్య 2012 నాటి నుంచి సుదీర్ఘ భాగస్వామ్యం కలిగి ఉంది. విద్యా బృందం ఎయిర్‌టెల్ డిటిహెచ్ వినియోగదారుల కోసం ఆకాష్ టివి ట్యూటరింగ్‌ను పరిచయం చేసింది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్తగా జోడించిన ఇతర ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్తగా జోడించిన ఇతర ఛానెల్‌లు

ఎయిర్టెల్ డిజిటల్ టివి తన ప్లాట్‌ఫామ్‌లో గత కొన్ని వారాల నుండి అనేక ఛానెల్‌లను జోడించింది మరియు కొన్నిటిని తొలగించింది కూడా. కొద్ది రోజుల క్రితం ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ‘ఎంకే న్యూస్' మరియు ‘మ్యూజిక్ జోన్' వంటి రెండు కొత్త ఛానెల్‌లను జోడించింది. అయితే ఇవి రెండూ కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వస్తాయి. అలాగే ‘ఖుషీ టీవీ'తో పాటు‘ సహారా సమయ్ ఎంపీ ',‘ సహారా సమయ్ యుపి ',‘ సహారా సమయ్ బీహార్ 'వంటి ఛానెల్‌లను డిటిహెచ్ ఆపరేటర్ తొలగించింది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV Offering Two Education Channels For JEE & NEET Students

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X