Airtel డిజిటల్ టివిలో 2 Vedantu ఛానెల్‌లు!!! IIT క్లాసులకు ప్రత్యేక శిక్షణ...

|

ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (DTH) ఆపరేటర్లలో ఎయిర్‌టెల్ డిజిటల్ టివికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత విద్యార్థులకు ఆన్ లైన్ పద్దతిలో బోధనను చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఇప్పుడు తన చందాదారులకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాన్ని అందించడానికి వేదాంటుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎయిర్టెల్ - వేదాంటు మాస్టర్ క్లాస్ భాగస్వామ్యం

ఎయిర్టెల్ - వేదాంటు మాస్టర్ క్లాస్ భాగస్వామ్యం

ఎయిర్టెల్ డిజిటల్ టివి వేదాంటు భాగస్వామ్యం సర్వీసులో భాగంగా 6 నుండి 12 తరగతుల విద్యార్థులు ఇంటి వద్దనే ఉండి వారి యొక్క టీవీల ద్వారా వారి యొక్క క్లాసులను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఎయిర్‌టెల్ డిటిహెచ్ ఆపరేటర్ తన చందాదారుల కోసం రెండు అంకితమైన ‘వేదాంటు మాస్టర్ క్లాస్' ఛానెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ప్లాట్‌ఫామ్‌లోని ప్రతి చందాదారులు పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??Also Read: WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??

ఎయిర్టెల్ డిజిటల్ టివి చందాదారులకు వేదాంటు ఛానెల్‌లు

ఎయిర్టెల్ డిజిటల్ టివి చందాదారులకు వేదాంటు ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన యొక్క ప్లాట్‌ఫామ్‌లో కొన్ని వారాల క్రితం పరీక్ష కోసం రెండు కొత్త ‘వేదాంతు మాస్టర్‌క్లాస్' ఛానెల్‌లను జోడించింది. కానీ ఇప్పుడు ఈ డిటిహెచ్ ఆపరేటర్ ఎట్టకేలకు చందాదారుల కోసం ఈ ఛానెల్‌ను అధికారికంగా చేసింది. అయితే ఇది రోజుకు 4 రూపాయల వ్యయంతో లభిస్తుంది. లైవ్ క్లాసులు మరియు ఇతర విద్యా కోర్సుల కోసం ప్రజలు ఖర్చు చేసే డబ్బును పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువగానే ఉంది. వేదాంతు ఛానెల్స్ రెండూ కూడా అన్ని తరగతుల సైన్స్ మరియు మ్యాథ్స్ వంటి రెండు విషయాలను మాత్రమే కవర్ చేస్తాయి.

వేదాంతు ఛానెల్‌లలో ఐఐటి బోధనలు

వేదాంతు ఛానెల్‌లలో ఐఐటి బోధనలు

ఐఐటి మరియు ఎయిమ్స్ వంటి సంస్థలకు సంబందించిన మరియు అధిక అర్హత కలిగిన నిపుణులు మాత్రమే ఇందులో అన్ని తరగతులకు సంబందించిన క్లాసులను బోధిస్తారు. ప్రధానంగా హిందీ మరియు ఇంగ్లీష్ రెండు భాషలలో మాత్రమే ప్రస్తుతానికి ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు వేదాంటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విద్యా విషయాలను అందించాలని యోచిస్తున్నాయి. భారతదేశం అంతటా గల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ లైవ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ గా వేదాంతు ఉంది. ఇందులో అన్ని తరగతుల క్లాసులు నిజ సమయంలో జరుగుతాయి కాబట్టి ఇందులో ముందుగా రికార్డ్ చేసిన పాఠాలను చూడటం లేదు.

వేదాంతు ఛానెల్‌ల లైవ్ కంటెంట్ & క్విజ్‌

వేదాంతు ఛానెల్‌ల లైవ్ కంటెంట్ & క్విజ్‌

ఆన్‌లైన్ లైవ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లోని ‘వేదాంతు' ఛానెల్‌ల నుండి చందాదారులు ప్రతి రోజు 11 గంటల తాజా కంటెంట్ ను ప్రసారం చేయగలదని ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్రకటించింది. ఏదైనా పాఠాలు లేదా క్విజ్‌లను కోల్పోయిన విద్యార్థుల కోసం రోజులోని వేరే సమయంలో అదే రిపీట్ టెలికాస్ట్‌ను కూడా చూడవచ్చు. సెట్-టాప్ బాక్స్ యొక్క రిమోట్ ద్వారా క్విజ్‌లకు సమాధానాలను ఇచ్చే అవకాశం కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV Offering Two Vedantu Channels to Interactive Learning Experience

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X