Home
News

Airtel Digital TV సెకండరీ కనెక్షన్‌ను పొందే వారికి సూపర్ న్యూస్!!!

ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ డిజిటల్ టివి ప్రతి నెల తన యొక్క చందాదారుల సంఖ్యను పెంచుకుంటున్నది. ఈ ఆపరేటర్ ప్రతి త్రైమాసికంలోను లక్ష మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంటున్నట్లు నివేదిస్తోంది. ట్రాయ్ ఎప్పటికప్పుడు చేసే మార్పులను అమలు చేసే డిటిహెచ్ ఆపరేటర్లలో ఎయిర్టెల్ డిజిటల్ టివి మొదటి స్థానంలో ఉంటుంది. ఇటీవల నేషనల్ టారిఫ్ ఆర్డర్ (NTO) 1.0 & 2.0 తో మార్కెట్ యొక్క ల్యాండ్ స్కేప్ ను ట్రాయ్ మార్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అమలులోకి వచ్చిన NTO 2.0 లో భాగంగా మొదటి మరియు రెండవ కనెక్షన్ల కోసం నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF) ను సవరించింది. ఈ సవరణల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ డిజిటల్ టివి సెకండరీ కనెక్షన్ NCF వివరాలు

ఎయిర్టెల్ డిజిటల్ టివి సెకండరీ కనెక్షన్ NCF వివరాలు

ఇండియాలోని అన్ని DTH ఆపరేటర్లలో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు అనేది సాధారణంగా ట్రాయ్ అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ప్రైమరీ కనెక్షన్ యూజర్లు 200 SD FTA ఛానెళ్లను రూ.153.4 ధర వద్ద మరియు 200 SD FTA ఛానెళ్లను 188.80 రూపాయల ధర వద్ద పొందవచ్చు. DTH ఆపరేటర్ యొక్క వినియోగదారులు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా FTA ఛానల్ ప్యాక్‌లను సులభంగా ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే సెకండరీ కనెక్షన్ యొక్క NCF ఛార్జీల విషయానికి వస్తే 200 SD ఛానెళ్లను రూ.52 ధర వద్ద (పన్నులతో కలుపుకొని రూ.61.36), అలాగే 200 SD ఛానెళ్ల ప్యాక్‌ను రూ.64 పన్నులతో కలుపుకొని రూ.75.52 ధర వద్ద పొందవచ్చు.

 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సెకండరీ కనెక్షన్‌ను పొందే విధానం

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సెకండరీ కనెక్షన్‌ను పొందే విధానం

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క కనెక్షన్ ను ఇప్పటికే కలిగి ఉన్న వినియోగదారులు కస్టమర్ సపోర్ట్ ను సంప్రదించి లేదా వెబ్‌లో పోర్టల్‌లో లాగిన్ అయి రెండవ కనెక్షన్‌ను అభ్యర్థించవచ్చు. అయితే సెకండరీ కనెక్షన్ పొందే వినియోగదారులు కొత్త సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేయవలసిన అవసరం మాత్రం ఉంటుంది. అయితే స్టాండర్డ్ హెచ్‌డి STB ధర రూ.1,300 తో పోలిస్తే రెండవ కనెక్షన్ కోసం కొనుగోలు చేసే STB ధర కొద్దిగా తక్కువగా ఉంటుంది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ 'ADTV10' కోడ్‌ క్యాష్ బ్యాక్ వివరాలు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ 'ADTV10' కోడ్‌ క్యాష్ బ్యాక్ వివరాలు

టాటా స్కై మాదిరిగానే ఎయిర్టెల్ డిటిహెచ్ ఆపరేటర్ కొత్త కనెక్షన్లపై 10% తగ్గింపును అదనంగా కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క కొత్త కనెక్షన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు బాక్స్ మీద రూ.300 వరకు తగ్గింపును పొందటానికి 'ADTV10' కోడ్‌ను ఖచ్చితంగా వినియోగించవలసి ఉంటుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ ను వినియోగదారులు ప్రస్తుతం రూ.1,300 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లు రూ.100 నుండి ప్రారంభమవుతాయి. అయితే ప్రతి ఛానల్ ప్యాక్ మీద NCF‌గా రూ.153 వినియోగదారుల నుంచి వసూలు చేయబడుతుంది. ఈ అదనపు మొత్తాన్ని గత సంవత్సరం ట్రాయ్ ప్రవేశపెట్టినది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV Secondary Connection NCF Charges Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X