సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి

|

భారతి ఎయిర్‌టెల్ యొక్క డిటిహెచ్ ఆర్మ్ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఈ రంగంలో కొన్ని ముఖ్యమైన పురోగతులను సాధిస్తోంది. 2017లో వినియోగదారుల కోసం 'ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ' అనే ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను మొదటి సారిగా ప్రారంభించింది. ఇటీవల ఇది ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో సరికొత్త ఆండ్రాయిడ్ టీవీ 9 పైని బాక్స్ నుండి బయటకు తీసుకువచ్చింది.

 

OTT కంటెంట్

శాటిలైట్ టివి మరియు OTT కంటెంట్ రెండింటినీ చూడటానికి వినియోగదారులను అనుమతించే హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌తో పాటు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి వినియోగదారులకు SD మరియు HD సెట్-టాప్ బాక్స్‌లను కూడా అందిస్తోంది. రోజు రోజుకు DTH పరిశ్రమలో పోటీ పెరుగుతుండటంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి డిటిహెచ్ ఆపరేటర్లు తమ STBల ధరలను తగ్గిస్తున్నాయి. కొత్త టారిఫ్ పాలన అమలులోకి రావడంతో DPOs ఛానల్ ప్యాక్‌లపై భారీ తగ్గింపును ఇవ్వడం అసాధ్యం చేసింది. కాబట్టి వారు ఇప్పుడు ఎక్కువ మంది చందాదారులను బోర్డులో చేర్చుకోవడం మీద దృష్టి పెడుతున్నారు.

 

 

ZEE5,హాట్స్టార్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న జియో ఫైబర్ కనెక్షన్ZEE5,హాట్స్టార్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్న జియో ఫైబర్ కనెక్షన్

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరలు
 

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరలు

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ప్రస్తుతం వినియోగదారులకు మూడు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తోంది. ఈ సెట్-టాప్ బాక్స్‌లలో స్టాండర్డ్ డెఫినిషన్ (SD) మరియు హై డెఫినిషన్ (HD) కాగా మూడవది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్. కొన్ని ప్రాంతాల్లో ఈ డిటిహెచ్ ఆపరేటర్ ఇప్పటికీ వినియోగదారులకు ఎయిర్టెల్ ఇంటర్నెట్ టివిని అందిస్తోంది. ఇంక ధరల విషయానికొస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క SD సెట్-టాప్ బాక్స్ ప్రస్తుతం రూ.1,100 లకు, హెచ్‌డీ సెట్-టాప్ బాక్స్ 1,300 రూపాయల రిటైల్ ధర వద్ద లభిస్తుంది.

 

 

గూగుల్ ప్లే స్టోర్ లో కంట్రీను మార్చడం ఎలా?గూగుల్ ప్లే స్టోర్ లో కంట్రీను మార్చడం ఎలా?

ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

చివరగా ఎయిర్టెల్ యొక్క ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కొత్త వినియోగదారుల కోసం 3,999 రూపాయల ధర వద్ద లభిస్తుంది. అయితే పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ థాంక్స్ సభ్యులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను కేవలం 2,249 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే సరసమైన ఆండ్రాయిడ్ టివి బాక్స్‌లో ఇది ఒకటి. డిష్ టివి యొక్క ఆండ్రాయిడ్ టివి బాక్స్‌ డిష్ SMRT హబ్‌ ఇప్పుడు వినియోగదారులకు 3,999 రూపాయల ధర వద్ద అందిస్తోంది. కాబట్టి ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్రస్తుతం తన ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌తో పైచేయి సాధించింది.

 

 

 

ఎయిర్‌టెల్, జియో VoWi-Fi ఫీచర్ యొక్క పరిమితులుఎయిర్‌టెల్, జియో VoWi-Fi ఫీచర్ యొక్క పరిమితులు

ఇతర సెట్-టాప్ బాక్స్‌లతో పోలికలు

ఇతర సెట్-టాప్ బాక్స్‌లతో పోలికలు

టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై. ఇందులో ప్రస్తుతం ఎస్‌డి, హెచ్‌డి, + హెచ్‌డి మరియు అల్ట్రా హై డెఫినిషన్ 4K వంటి నాలుగు STBలు ఉన్నాయి. కొత్త వినియోగదారుల కోసం టాటా స్కై యొక్క SD సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,399 కాగా, హెచ్‌డి వేరియంట్ యొక్క ధర రూ.1,499. అలాగే + హెచ్‌డి STB యొక్క ధర రూ.2,300 కాగా, 4K STB బాక్స్‌ను రూ.6,400 ధర వద్ద పొందవచ్చు.

 

 

నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లునెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

 

డిష్ టివి సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

డిష్ టివి సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

డిష్ టివి కూడా ప్రస్తుతం మూడు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తున్నది. ఇందులో DishNXT SD, DishNXT హెచ్‌డి మరియు డిష్ SMRT హబ్ ఉన్నాయి. ఇందులో DishNXT హెచ్‌డి బాక్స్ యొక్క ధర రూ.1,590 కాగా, DishNXT SD బాక్స్ యొక్క ధర రూ.1,490లు. అలాగే డిష్ SMRT హబ్ ప్రస్తుతం మార్కెట్లో రూ.3,999 ధర వద్ద లభిస్తుంది.

 

అందుబాటులోకి జియో VoWi-Fi సర్వీస్అందుబాటులోకి జియో VoWi-Fi సర్వీస్

D2h సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

D2h సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

D2h ఆపరేటర్ విషయానికి వస్తే ఇది కూడా ప్రస్తుతం HD, SD మరియు HD RF వంటి మూడు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తోంది. ఇందులో D2h యొక్క SD బాక్స్ ధర రూ.1,599 కాగా HD బాక్స్ యొక్క ధర రూ.1,699లు. చివరగా డి 2 హెచ్ యొక్క HD RF సెట్-టాప్ బాక్స్ ధర 1,799 రూపాయలు.

 

 

Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...

సన్ డైరెక్ట్ సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

సన్ డైరెక్ట్ సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

దక్షిణ భారతదేశానికి చెందిన సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఆపరేటర్‌ ప్రస్తుతం తన వినియోగదారులకు ఎస్‌డి + మరియు హెచ్‌డి + అనే రెండు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తున్నది. ఇందులో SD+ సెట్-టాప్ బాక్స్ యొక్క ధర 1,799 రూపాయలు. అలాగే హెచ్‌డి + బాక్స్ ప్రస్తుతం రూ.1,999ల ధర వద్ద లభిస్తుంది. మొత్తంమీద అన్ని ఆపరేటర్‌లతో పోలిస్తే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి అందరి కంటే తక్కువ ధర వద్ద అన్ని రకాల సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తున్నది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV Set-Top Box Now Available at Lower Price For New Customers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X