ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ఈ కాంప్లిమెంటరీ ఆఫర్ నిలుపుదల..!
టెలికాం సంస్థలు ఇటీవల కాలంలో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై కాలింగ్, డేటా, SMS సహా అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లతోపాటు మరిన్ని ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ లను ( AI ) అనేక సంస్థలు తమ యూజర్లకు ఉచితంగా వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నాయి.
ఎయిర్‌టెల్ (Airtel) తన యూజర్లకు పెర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. అదే జియో యూజర్లు గూగుల్ జెమిని ప్రో మోడల్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఏఐ మోడల్‌తోపాటు ఎయిర్‌టెల్ ఇటీవలే తన యూజర్లకు అడాబ్ ఎక్స్‌ప్రెస్ ను ఉచితంగా ఉపయోగించుకొనే అవకాశం కల్పించింది.

కాంప్లిమెంటరీ ప్లాన్‌ను నిలిపేసిన ఎయిర్‌టెల్ :
ఎయిర్‌టెల్ తాజాగా తన యూజర్లకు షాక్ ఇచ్చింది. పెర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ను నిలిపివేసింది. అయితే ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ను తీసుకున్న యూజర్లు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. కొత్తగా ఆఫర్ ను యాక్టివేట్ చేసుకొనే అవకాశం లేదని తెలిపింది.
గత సంవత్సరం ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెర్‌ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందించే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకటన సమయంలోనే పరిమిత కాలానికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. తాజాగా ఆఫర్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం :
ఇటీవలే ఎయిర్‌టెల్ తన యూజర్లకు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం కల్పించింది. దీని సాధారణ విలువ రూ.4000 గా ఉంటుందని తెలిపింది. అయితే ఎయిర్‌టెల్ యూజర్లు ఉచితంగా 12 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, DTH సబ్‌స్క్రైబర్లు, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు అడోప్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్లకు, చిరు వ్యాపారులు, ఇతర యూజర్లకు ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాంకింగ్ వివరాలు అందించాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ ద్వారా నేరుగా సైన్-ఇన్ కావడం లేదా అడోబ్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లో భాగంగా ప్రతి నెలా 250 జనరేటివ్ AI క్రెడిట్‌లు, స్టాటిక్, వీడియో కంటెంట్ కోసం టెంప్లేట్లు దీంతోపాటు అడోబ్ స్టాక్ అసెట్స్, 30 వేలకు పైగా ఫాంట్‌లు, వీడియో బ్యాగ్రౌండ్ ను తొలగించే ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. హిందీ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, తమిళం వంటి 8 భాషలను సపోర్టు చేస్తుంది.
భారత ప్రజలు తమ కెరీర్, వ్యాపారాలను వృద్ధి చేసుకొనేందుకు లేదా అభిరుచులను ప్రొత్సహించడం, ప్రత్యేకమైన కంటెంట్ ను సింపుల్ గా ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పించడం తమ ఉద్దేశమని అడోబ్ క్రియేటివిటీ, ప్రొడవిటీ బిజినెస్ అధ్యక్షడు డేవిడ్ వాదనీ తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్ తో భాగస్వామ్యంతో ఆనందం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








