Airtel సిమ్‌తో ఐఫోన్ 8 గెలుచుకునే అద్భుత అవకాశం, మిస్ కాకండి

|

సమ్మర్ లో ఐపీఎల్ సంబరాలు మిన్నంటున్న సంగతి అందిరకీ తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను అభిమానులు చాలా బాగా ఆస్వాదిస్తున్నారు కూడా. ఇక టెలికాం దిగ్గజాలు కూడా ఈ సంబరాలను క్యాష్ చేసుకోవడానికి భారీ వ్యూహాలతోనే దూసుకొచ్చాయి. ఐపీఎల్ చూడాలనుకునే తమ యూజర్లకు డేటా ఆఫర్లను ప్రకటిస్తూ వారిని డేటా మత్తులో ముంచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో Airtel మరో అడుగు ముందుకేసింది. Airtel సిమ్ కార్డుతో ఐఫోన్ 8ను గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. T20 on Airtel4G contestలో భాగంగా ఈ అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. మరి ఐఫోన్ 8 ఎలా గెలుపొందాలో ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

జియోని టార్గెట్ చేస్తున్న Airtel రూ. 129 ప్లాన్జియోని టార్గెట్ చేస్తున్న Airtel రూ. 129 ప్లాన్

ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తో సెల్ఫీ..

ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తో సెల్ఫీ..

కస్టమర్లు ముందుగా తమ ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తో సెల్ఫీ తీసుకోవాలి. ఎయిర్‌టెల్ సిమ్ లేకపోతే కొత్తగా సిమ్‌ను కొనుగోలు చేసి దాంతో కూడా సెల్ఫీ దిగవచ్చు.

#T20onAirtel4G హ్యాష్‌ట్యాగ్..

#T20onAirtel4G హ్యాష్‌ట్యాగ్..

అనంతరం ఆ ఫొటోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్‌లలో #T20onAirtel4G హ్యాష్‌ట్యాగ్ పెట్టి కస్టమర్ తన ముగ్గురు ఫ్రెండ్స్‌తోపాటు ఎయిర్‌టెల్‌కు @AirtelIndia అకౌంట్ పేరిట ట్యాగ్ చేయాలి. #T20onAirtel4G హ్యాష్ ట్యాగ్ ను మీరు తప్పనిసరిగా యూజ్ చేయాలి.

ఫొటోలు షేర్ చేసిన వారిలోంచి ..
 

ఫొటోలు షేర్ చేసిన వారిలోంచి ..

దీంతో ఈ పోటీకి వినియోగదారులు అర్హులు అవుతారు. ఈ క్రమంలో ఇలా ఫొటోలు షేర్ చేసిన వారిలోంచి ఒక లక్కీ కస్టమర్‌ను రోజూ ఎంపిక చేస్తారు. ఆ కస్టమర్‌కు ఒక ఐఫోన్ 8ను బహుమతిగా అందిస్తారు.

బహుమతి గెలుచుకున్న కస్టమర్..

బహుమతి గెలుచుకున్న కస్టమర్..

అయితే బహుమతి గెలుచుకున్న కస్టమర్ 24 గంటల్లోగా స్పందించి గిఫ్ట్‌ను క్లెయిమ్ చేసుకోవాలి. లేదంటే తరువాత లక్కీ కస్టమర్‌కు ఆ బహుమతిని అందజేస్తారు. మీరు లక్కీ కస్టమర్ అయ్యారో లేదో తెలుసుకోవాలంటే Airtel అఫిషియల్ ట్విట్టర్ పేజీని ఫాలో అవ్వాలి. అందులో ఫోన్ గెలుపొందిన వారి వివరాలను కంపెనీ ట్వీట్ చేస్తుంది.

మే 3వ తేదీ వరకు..

మే 3వ తేదీ వరకు..

ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ విన్ యాన్ ఐఫోన్ 8 ఎవ్రీ డే ఆఫర్ మే 3వ తేదీ వరకు కొనసాగనుంది. మరింతగా యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ రకమైన ప్లాన్ కు Airtel తెరలేపిందని తెలుస్తోంది.

మొత్తం 7 మందిని

మొత్తం 7 మందిని

కాగా రోజుకొకరు చొప్పున మొత్తం 7 మందిని ఈ లక్కీ డ్రా ద్వారా Airtel సెలక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఏడుమందిలో మీరు ఒకరు కావచ్చు. ఇంకెందుకాలస్యం. వెంటనే సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. హ్యాష్ ట్యాగ్ లు మాత్రం మరువొద్దు.

ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్.

Best Mobiles in India

English summary
Airtel Allows You To Win An iPhone 8 Every Day In The IPL Season More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X