ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!

By Maheswara
|

భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ అయిన భారతి ఎయిర్‌టెల్ ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ ఖండాలలో విస్తరించి ఉన్న అనేక దేశాలలో తమ నెట్వర్క్ ను కలిగి ఉంది. ఈ టెలికాం దిగ్గజం ఇప్పటికే భారత మార్కెట్లో 5G ని లాంచ్ చేసి 5G సేవలను అందిస్తోంది. 2023,జనవరిలో, ఎయిర్‌టెల్ ఆఫ్రికా లో 5G సేవలను ప్రారంభించడానికి 5G స్పెక్ట్రమ్‌ను పొందింది. అదేవిధంగా, ఎయిర్టెల్ యాజమాన్యంలోని టెల్కో మరియు టెలికాం కంపెనీలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో 5G సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. వోడాఫోన్ గ్రూప్ ఎయిర్టెల్ కంటే పెద్దది అయినప్పటికీ, ఎయిర్‌టెల్ విస్తరిస్తున్న విధానం ను గమనిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద 5G సేవలను అందించే నెట్వర్క్ గా అవతరించే అవకాశం ఉంది. వొడాఫోన్ గ్రూప్ యాజమాన్యంలోని వొడాఫోన్ ఐడియా భారతీయ మార్కెట్లో 5Gని లాంచ్ చేయడానికి ఇంకా చాలా దూరంలో ఉంది.

 
Airtel Expected To Become Largest 5G Network In The World By March 2024.

ఎయిర్‌టెల్ ఇప్పటికే భారతదేశంలో 67 నగరాల్లో 5G ని లాంచ్ చేసింది

 

ఎయిర్టెల్ యొక్క 5G నెట్వర్క్ ఇప్పటికే భారతదేశంలోని 67 నగరాల్లో అందుబాటులో ఉంది. రాబోయే FY24 చివరి నాటికి (మార్చి 2024), ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌లతో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ దశాబ్దం చివరి నాటికి, భారతదేశంలోని రెండు ప్రధాన 5G టెలికాం సంస్థలైన వాటిలో Airtel ఒకటి. అయితే, దాదాపు 350 మిలియన్ల 5G వినియోగదారులకు ఎయిర్టెల్ సేవలను అందిస్తోంది. 2028 చివరి నాటికి భారతదేశంలో దాదాపు 570 మిలియన్ల 5G వినియోగదారులను కలిగి ఉంటారని ఎరిక్సన్ రిపోర్ట్ తెలిపింది. 2030 చివరి నాటికి, ఈ సంఖ్య 650-700 మిలియన్లకి పెరుగుతుంది. ఈ విధంగా, ఎయిర్‌టెల్ 5G మార్కెట్ వాటాలో సగం కూడా కలిగి ఉంటే, టెల్కో దాదాపు 350 మిలియన్ల 5G వినియోగదారులను కలిగి ఉంటుందని అర్థం.

Airtel Expected To Become Largest 5G Network In The World By March 2024.

భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ గా ఉంది. జనాభా పెరగడం మరియు స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడంతో, భారతదేశంలో టెలికాం కంపెనీల మార్కెట్ పరిమాణం పెరుగుతుందని అర్థం. అయితే ఎయిర్‌టెల్ భారతదేశంలోనే పెద్దది కాదు. ఇది ఇప్పటికే ఆఫ్రికాలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి. Airtel ఆఫ్రికా ఇటీవల PAT (పన్ను తర్వాత లాభం) $523 మిలియన్లను రికార్డులలో చూపించింది. వివిధ అంతర్జాతీయ మార్కెట్‌లలో ఎయిర్‌టెల్ అనేక స్వంత టెలికాం కంపెనీలను కూడా కలిగి ఉంది. భారతదేశం, ఆఫ్రికా మరియు ఇతర మార్కెట్‌లను కలిపి, దశాబ్దం చివరి నాటికి, Airtel దాదాపు 1 బిలియన్ కస్టమర్‌లకు 5G సేవలను అందించగలదు అని అంచనాలున్నాయి.

Airtel Expected To Become Largest 5G Network In The World By March 2024.

ఇప్పుడు, మనం తెలుసుకున్న వివరాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, వీటిలోని నిజానిజాలు తెలియాలంటే, 2030 వరకు ఆగాల్సిందే. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఎయిర్‌టెల్ భారీ గ్లోబల్ నెట్వర్క్ ను నిర్మిస్తోంది మరియు ఇది వినియోగదారుల వ్యాపారంపై మాత్రమే ఆధారపడకుండా B2B కార్యకలాపాలను కూడా పెంచుకుంటోందని అనేక రిపోర్టులు చెప్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఒక ప్రధాన పాదముద్రను వదిలివేసింది, అయితే రాబోయే సంవత్సరాల్లో, మరిన్ని పెట్టుబడులు మరియు విస్తరణతో, ఇది ఖచ్చితంగా ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం గ్రూపులలో ఒకటిగా అవతరిస్తుంది. ఇంకా ఎయిర్టెల్ 5G డౌన్‌లోడ్ వేగాన్ని దాదాపు 762 Mbps - 1023 Mbps మరియు అప్‌లోడ్ వేగం 119 Mbps - 170 Mbps వరకు గరిష్ట స్థాయిని రికార్డు చేయడం కూడా జరిగింది.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Expected To Become Largest 5G Network In The World By March 2024.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X