ఎయిర్‌టెల్ రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లో కొత్తగా మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లు చేరాయి!!

|

ఇండియాలోని రెండవ అతి పెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ గత ఏడాది అక్టోబర్‌లో తన వినియోగదారుల కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 4G కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి భారతదేశంలోని వినియోగదారులను ప్రోత్సహించడం మరియు అధిక-ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం అనేది ఈ ఆఫర్ యొక్క ముఖ్యఉద్దేశం. ఈ విధంగా ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క ప్రతి వినియోగదారుల సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే కాకుండా భారతదేశంలో 4G కస్టమర్‌లను మరింత పెంచుకునేలా ఆన్‌బోర్డ్ చేస్తుంది.

ఎయిర్‌టెల్

కొత్త అలవాట్లను ఏర్పరచుకోనే వారు లేదా వారి జీవితంలో ఏదైనా మార్చుకోవాలని కోరుకునే వారికి ప్రోత్సాహకంగా ఎయిర్‌టెల్ రూ.6,000 స్మార్ట్‌ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. అయితే జూన్ 1, 2022 వరకు ఉన్న రూ.6000 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని ఇప్పుడు కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఎయిర్‌టెల్ మళ్ళి పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొడగింపు

ఎయిర్‌టెల్ రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొడగింపు

భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారుల కోసం ప్రకటించిన రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లో భాగంగా జూన్ 1, 2022 న కొత్తగా 10 కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌లను జోడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఐటెల్ A16 ప్లస్, ఐటెల్ A17, ఐటెల్ A37, ఐటెల్ P17, నోకియా C01 ప్లస్, Xiaomi Poco M3 Pro 5G, Tecno Pop6 Pro, Infinix Smart 6 HD, Motorola Moto G22 మరియు Oppo A16E వంటివి ఉన్నాయి. దీని అర్థం భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు ఎయిర్‌టెల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు అవుతారు.

ఎయిర్‌టెల్ రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ రూ.6000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ అక్టోబర్ 8, 2021న స్మార్ట్‌ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను మొదటిసారి ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన 4G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందించబడింది. అర్హత ఉన్న పరికరాల జాబితాలో ఎయిర్‌టెల్ టెల్కో చేర్చిన మరియు వినియోగదారులు కొనుగోలు చేసిన సంబంధిత కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కి అర్హత పొందుతాయి. ఇంకా స్మార్ట్‌ఫోన్ దాని కొనుగోలు తేదీ నుండి 30 రోజుల వరకు ఆఫర్‌కు అర్హులు అవుతారు.

నిబంధనలు

వినియోగదారులు ఆఫర్ యొక్క నిబంధనలు మరియు షరతులను అన్నిటిని కూడా జాగ్రత్తగా పాటిస్తే వారి బ్యాంక్ అకౌంటులో నేరుగా రూ.6,000 క్యాష్‌బ్యాక్ మొత్తం జమ చేయబడుతుంది. ఎయిర్‌టెల్ సంస్థ వినియోగదారుల యొక్క ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంటులో ఈ క్యాష్‌బ్యాక్‌ను రెండు విడతలుగా అందిస్తుంది. కాబట్టి మీకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లేకుంటే కనుక మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా దాన్ని వెంటనే తెరవడం మంచిది.

రూ.6000 క్యాష్‌బ్యాక్

ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.6000 క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని పొందడానికి ముఖ్యంగా రూ.249 లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్‌లతో (కనీసం 28 రోజుల సర్వీస్ వాలిడిటీ ప్లాన్ కోసం 1GB రోజువారీ డేటా మరియు అంతకంటే ఎక్కువ) మూడు సంవత్సరాలు లేదా 36 నెలల పాటు నిరంతరం రీఛార్జ్ చేసుకోవడం కొనసాగించాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఇక్కడ నిరంతర రీఛార్జ్ అంటే ఆఫర్‌కు అర్హత పొందేందుకు వినియోగదారులు తమ ప్లాన్ గడువు ముగిసినప్పటి నుండి మళ్లీ రీఛార్జ్ చేయడానికి 24 గంటల విండోను కలిగి ఉంటారని గుర్తుంచుకోండి.

రీఛార్జ్‌

18 నెలల పాటు నిరంతరాయంగా రీఛార్జ్‌ చేసుకున్న తర్వాత మొదటి విడతలో భాగంగా రూ.2,000 మొత్తాన్ని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది. 36 నెలలు లేదా మూడేళ్ల నిరంతర రీఛార్జ్‌ల తర్వాత రూ.4,000 మొత్తాన్ని రెండో విడతలో వినియోగదారుల యొక్క అకౌంట్ కి అందివ్వబడుతుంది.

క్యాష్-బ్యాక్ క్లెయిమ్‌

ఎయిర్‌టెల్ వినియోగదారులు పైన తెలిపిన అన్ని రకాల షరతులను నెరవేర్చిన తర్వాత కస్టమర్ బ్యాంక్ అకౌంటుకు మొత్తం డబ్బు చేరడానికి దాదాపు 90 రోజులు పడుతుంది. ఎయిర్‌టెల్ కమ్యూనికేషన్ నుండి 15 రోజులలోపు వినియోగదారులు క్యాష్-బ్యాక్ క్లెయిమ్‌ను అంగీకరించాలి. కాబట్టి మీరు దానిని కోల్పోతే మీరు ప్రయోజనం పొందలేరు. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్‌కు అర్హులు కారు. OEMల యొక్క అధీకృత విక్రయ ఛానెల్ ద్వారా కొనుగోలు చేసిన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఎయిర్‌టెల్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రయోజనాన్ని కూడా ఉచితంగా అందిస్తోంది.

Airtel & Google బిజినెస్ డీల్

Airtel & Google బిజినెస్ డీల్

భారతి ఎయిర్‌టెల్ కంపెనీ గూగుల్ నుండి $1 బిలియన్ పెట్టుబడిని పొందుతున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. గూగుల్ సంస్థ యొక్క $1 బిలియన్‌ పెట్టుబడిలో $700 మిలియన్లను టెల్కోలోని 1.28% వాటా పెట్టుబడి కోసం వినియోగించబడింది. మిగిలిన $300 మిలియన్ల మొత్తాన్ని బహుళ-సంవత్సరాలలో అనేక ఒప్పందాలను రూపొందించడం కోసం ఉద్దేశించబడనున్నట్లు ప్రకటించింది. గూగుల్ కంపెనీ ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులను పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో నిర్దిష్ట 5G వినియోగ సామర్ధ్యంను మెరుగ్గా సృష్టించడం. కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాన్ని టెల్కో వాటాదారులు అందరు కూడా ఆమోదం తెలిపారు. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నుండి తుది నిర్ణయం రావాల్సి ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ టెలికాం సంస్థలో $700 మిలియన్ల (రూ. 52,243.80 మిలియన్లు) గూగుల్ పెట్టుబడికి జూన్ 30, 2022న CCI నుండి గ్రీన్ లైట్ పొందినట్లు తెలిపింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరును రూ.734 చొప్పున మొత్తంగా 71,176,839 ఈక్విటీ షేర్లను ఎయిర్‌టెల్ సంస్థ గూగుల్‌కు జారీ చేయనున్నది. అంటే ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ 1.28% వాటాను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel Extended Rs.6000 Cashback Benefit to New Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X