జియోకి షాకిచ్చిన ఎయిర్‌టెల్‌, స్పీడ్‌లో టాప్ అదే

By Gizbot Bureau
|

టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు భారతీ ఎయిర్‌టెల్‌ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్పీడ్ టెస్ట్ లో జియో కన్నా భారతీ ఎయిర్‌టెల్‌ అందనంత దూరంలో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే భారత్‌లో అత్యంత వేగమైన నెట్‌వర్క్‌ అందిస్తున్న సంస్థల జాబితను 'ఊక్లా’ ప్రకటించింది.

జియోకి షాకిచ్చిన ఎయిర్‌టెల్‌, స్పీడ్‌లో టాప్ అదే

 

భారత్‌లో అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలందిస్తున్న కంపెనీగా 'భారతీ ఎయిర్‌టెల్‌’ నిలిచిందని స్పీడ్‌టెస్ట్‌ డేటా సేవలందించే సంస్థ 'ఊక్లా’ ప్రకటించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఎయిర్‌టెల్‌ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించింది.

జియో నెట్‌వర్క్‌ చాలా నెమ్మదిగా

జియో నెట్‌వర్క్‌ చాలా నెమ్మదిగా

ఢిల్లీ పరిధిలో అత్యంత వేగమైన 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌గా వొడాఫోన్‌ నిలిచింది. వొడాఫోన్‌, ఐడియా కలిసిపోవడంతో డేటా వేగం పెరిగినట్టు వెల్లడించింది. గతనెల్లో రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ చాలా నెమ్మదిగా ఉందని పేర్కొంది.

 మే నెల నుంచి

మే నెల నుంచి

అయితే, ఊక్లా నివేదిక ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారానికి విరుద్ధంగా ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌లో రిలయన్స్‌ జియో ప్రథమ స్థానంలో ఉండగా.. వేగం విషయంలో పోటీ కంపెనీలకు రెట్టింపు వేగంతో ఉందని ట్రాయ్‌ విశ్లేషణ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది మే నెల నుంచి ఎయిర్‌టెల్‌, జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ తగ్గిందని ‘ఊక్లా' తెలిపింది.

వొడాఫోన్‌, ఐడియా
 

వొడాఫోన్‌, ఐడియా

భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్,రిలయన్స్ జియో లాంటి నెట్ వర్క్ సంస్ధల బ్రాడ్‌బ్యాండ్ల పనితీరుపై ఓక్లా అధ్యయనం చేసింది. వొడాఫోన్‌, ఐడియా కలిసిపోవడంతో వాటి ఈ మొబైల్‌ నెట్‌వర్క్‌ వినియోగదారుల డౌన్‌లోడ్‌ స్పీడ్‌ పుంజుకుందని గణాంకాలతో వివరించింది

అదనపు డేటా

అదనపు డేటా

ఈ నేపథ్యంలో జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా ఆఫర్ లభిస్తుంది.

ఎయిర్టెల్ డేటా ప్లాన్లు

ఎయిర్టెల్ డేటా ప్లాన్లు

ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్‌

ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్‌లో ప్రస్తుతం 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 200 జీబీ డేటాను ఆరు నెలల కాలపరిమితితో ఇస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్' ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099లో ప్రస్తుతం 100 ఎంబీపీఎస్ వేగంతో 300 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 500 జీబీ డేటా ఆరునెలల కాలపరిమితితో లభిస్తుంది. వాయిస్ కాల్స్, ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్' ప్రయోజనాలతోపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్

ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599లో ఇప్పటి వరకు 300 ఎంబీపీఎస్ వేగంతో 600 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడీ ప్లాన్‌తో అదనంగా 1000 జీబీ బోనస్ డేటా లభిస్తుంది. కాలపరిమితి 6 నెలలు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లో లభించే అన్ని ప్రయోజనాలు ఇందులోనూ లభిస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel fastest mobile broadband network, Jio now slowest

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X