మహిళల రక్షణకు మై సర్కిల్‌ యాప్, ఎలా ఉపయోగపడుతుంది ?

మహిళలను దేవతలుగా భావించే మనదేశం లో ఆ మహిళలపై వేధింపులు పరా కాష్ఠకు చేరాయి. మహిళ లకు రక్షణలేని దేశాల్లో భారత్‌ది అగ్రస్థానమని థామస్ రాయి టర్స్ ఫౌండేషన్ నివేదిక తేల్చిచెప్పింది. ప్రపంచంలోని 193 దేశాల్లో

|

మహిళలను దేవతలుగా భావించే మనదేశం లో ఆ మహిళలపై వేధింపులు పరా కాష్ఠకు చేరాయి. మహిళ లకు రక్షణలేని దేశాల్లో భారత్‌ది అగ్రస్థానమని థామస్ రాయి టర్స్ ఫౌండేషన్ నివేదిక తేల్చిచెప్పింది. ప్రపంచంలోని 193 దేశాల్లో మనదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం ఆందోళన కలిగించే విషయం. గత కొన్నేళ్లుగా మహిళలపై దౌర్జన్యాలకు, వేధింపులకు అడ్డుకట్ట పడే దాఖలాలే కనబడటం లేదు.

మహిళల రక్షణకు మై సర్కిల్‌ యాప్, ఎలా ఉపయోగపడుతుంది ?

2011లో మహిళల రక్షణ కరువైన దేశాల్లో మనదేశం 4వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఎగ బాకి మొదటి స్థానంలో నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో మహిళల రక్షణకు అందరూ నడుం బిగిస్తున్నారు.వారు ఆపద సమయంలో చిక్కుకున్నప్పుడు వారికి అండగా ఉండేందుకు యాప్స్ కూడా తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ కూడా మై సర్కిల్‌ యాప్ పేరుతో ఓ యాప్ ను తీసుకువచ్చింది.

మై సర్కిల్‌

మై సర్కిల్‌

మై సర్కిల్‌ పేరుతో మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే యాప్‌ను భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) విడుదల చేశాయి. కేవలం ఎయిర్‌టెల్‌ యూజర్లనే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం వినియోగించుకోవచ్చు.

 ఐదుగురు సన్నిహితులకు ఎస్‌ఎంఎస్‌

ఐదుగురు సన్నిహితులకు ఎస్‌ఎంఎస్‌

ఈ యాప్‌ వినియోగించే మహిళలు తాము బాధాకరమైన లేదా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు సహాయం కోసం తమకు తెలిసిన ఐదుగురు సన్నిహితులకు ఎస్‌ఎంఎస్‌ పంపించవచ్చు. ఈ సందేశంలో ఉన్న లింక్‌ ఆధారంగా ఎస్‌ఎంఎస్‌ పంపిన మహిళ గూగుల్‌మ్యాప్‌ ద్వారా లొకేషన్‌కు వెంటనే చేరుకోవచ్చు.

ఇతర టెలికాం ఆపరేటర్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులూ

ఇతర టెలికాం ఆపరేటర్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులూ

ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర టెలికాం ఆపరేటర్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులూ ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ ఫోన్లకే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ‘ఐఒఎస్‌' వినియోగిస్తున్నవారికి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిర్‌టెల్‌ గ్లోబల్‌ సీఐఒ, డిజిటల్‌ హెడ్‌ హర్మీన్‌ మెహతా తెలిపారు.

13 భాషల్లో

13 భాషల్లో

తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, అస్సామీ, ఒరియా, గుజరాతీ భాషల్లో ఎస్‌ఎంఎస్‌ పంపవచ్చు. మొత్తంగా 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్‌ఓఎస్‌ అలర్ట్స్‌ను పంపుకోవచ్చు.

సిరి ద్వారా

సిరి ద్వారా

ఐఒఎస్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో సిరి ద్వారా ప్రస్తుతం వాయిస్‌ కమాండ్‌ను కూడా యాక్టివేట్‌ చేసే సౌలభ్యం ఉంది. ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లలో గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా ఇలా చేయడానికి మరికొంతకాలం పట్టనుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel, FLO launches MyCircle app for Women's Safety

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X