అమెజాన్ యూజర్ల కోసం ఎయిర్‌టెల్ రూ.51 గిఫ్ట్ కార్డ్
భారతదేశపు ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్, తన 23వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా సహకారంతో రూ.51 ఖరీదు చేసే అమెజాన్ పే డిజిటల్ గిఫ్ట్ కార్డును తమ యూజర్లకు ఉచితంగా అందిస్తోంది
భారతదేశపు ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్, తన 23వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా సహకారంతో రూ.51 ఖరీదు చేసే అమెజాన్ పే డిజిటల్ గిఫ్ట్ కార్డును తమ యూజర్లకు ఉచితంగా అందిస్తోంది. ఈ ఉచిత గిఫ్ట్ కార్డును ఇప్పటికు 10 లక్షల మంది కస్టమర్‌లు క్లెయిమ్ చేసుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

అమెజాన్ పే బ్యాలన్స్ అకౌంట్లలో యాడ్ అయ్యే....
అమెజాన్ పే బ్యాలన్స్ అకౌంట్లలో యాడ్ అయ్యే రూ.51 గిఫ్ట్ కార్డును మొబైల్ రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ అలానే ఆన్‌లైన్ కొనుగోళ్ల నిమిత్తం ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. అమెజాన్ పే పార్టనర్ మర్చెంట్స్ వద్ద కూడా ఈ గిఫ్ట్ కార్డును ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

ఎయిర్‌టెల్ యూజర్లు ముందుగా మైఎయిర్‌టెల్ యాప్‌ను....
ఈ గిఫ్ట్ కార్డును పొందాలనుకుంటోన్న ఎయిర్‌టెల్ యూజర్లు ముందుగా మైఎయిర్‌టెల్ యాప్‌ను తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ లాంచ్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై టాప్ స్లైడర్‌లో కనిపించే ‘Airtel Thanks' బ్యానర్‌ను సెలక్ట్ చేసుకుని Claim Now బటన్ పై క్లిక్ చేయాలి. ఈ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే కస్టమర్‌కు సంబంధించిన వోచర్ జనరేట్ అవుతుంది.

అమెజాన్ వెబ్‌సైట్ లేదా అమెజాన్ షాపింగ్ అప్లికేషన్‌లోకి....
ఇప్పుడు కాపీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత వోచర్‌కు సంబంధించిన కోడ్ కాపీ అవుతుంది. కోడ్ కాపీ అయిన తరువాత రిడీమ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే, వెంటనే మీరు అమెజాన్ వెబ్‌సైట్ లేదా అమెజాన్ షాపింగ్ అప్లికేషన్‌లోకి రీడైరెక్ట్ కాబడతారు. అమెజాన్ సైట్‌లోకి వెళ్లిన తరువాత మీ అమెజాన్ అకౌంట్ వివరాలతో లోపలికి లాగిన్ అవ్వాలి.

అమెజాన్ పే అకౌంట్‌లో మీ గిఫ్ట్ కార్డ్ తాలూకా....
మీ అకౌంట్లోకి లాగిన్ అయిన తరువాత కాపీ చేసుకున్న కోడ్‌ను సంబంధిత కోడ్ బాక్సులో పేస్ట్ చేసి ‘యాడ్ నౌ' బటన్ పై క్లిక్ చేసినట్లయితే అమెజాన్ పే అకౌంట్‌లో మీ గిఫ్ట్ కార్డ్ తాలూకా అమౌంట్ యాడ్ అవుతుంది. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ ఆఫర్ ద్వారా పొందిన రూ.51ని అక్టోబర్ 31.2018లోపు మాత్రమే వినియోగించుకోవాలిన ఎయిర్‌టెల్ చెబుతోంది.

అమెజాన్ పే డిజిటల్ గిఫ్ట్ కార్డును పొందాలనుకునే....
ఒక్కో అమెజాన్ అకౌంట్‌కు ఒక్కో గిఫ్టును మాత్రమే ఇవ్వటం జరుగుతుందట. అమెజాన్ పే డిజిటల్ గిఫ్ట్ కార్డును పొందాలనుకునే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ. 100 కంటే ఎక్కువ ఖరీదుతో కూడిన బండిల్డ్ ప్యాక్‌ను తీసుకోవల్సి ఉంటుంది. ఇదే సమయంలో పోస్ట్ పెయిడ్ చందాదారులు ఏదైనా ఇన్ఫినిటీ ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని ఎయిర్‌టెల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








