Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌లలో తక్కువ ధరకే డేటా లభ్యత!!! 1GB డేటా ఎంతో తెలుసా???

|

ఇండియాలోని టెలికామ్ రంగంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ గా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం మరియు మరికొంత మంది కొత్తవారిని ఆకట్టుకోవడానికి పలు రకాల ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం నిర్దిష్ట ప్రయోజనాలతో ఒక నిర్దిష్ట ప్లాన్ ను అందిస్తున్నది. మీరు దానిని ఎయిర్‌టెల్‌ యొక్క అన్ని రకాల ప్రయోజనాలతో పొందే అవకాశాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం టాక్ టైమ్ మరియు డేటా ప్రయోజనాలను అందించే అనేక టాప్-అప్ వోచర్లను కలిగి ఉన్నాయి. ఎయిర్టెల్ తన అన్ని రకాల వినియోగదారులకు వారికి అవసరమైన రీతిలో తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 1GB డేటాను కేవలం 4.15 రూపాయల ధర వద్దనే అందిస్తుంది. అంతే కాకుండా కస్టమర్లు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలు కానున్నాయి!!! రూ.1తో ప్రీ-బుక్ చేసుకునే అవకాశం!!!Also Read: Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలు కానున్నాయి!!! రూ.1తో ప్రీ-బుక్ చేసుకునే అవకాశం!!!

రూ.4.15లకే 1GB డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్‌

రూ.4.15లకే 1GB డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌ ఇప్పుడు తన వినియోగదారులకు 1GB మొబైల్ డేటాను కేవలం రూ.4.15 ధరకు అందిస్తున్నది. ఈ అద్భుతమైన ఆఫర్ ను ఎయిర్‌టెల్‌ యొక్క రూ .698 ప్రీపెయిడ్ ప్లాన్ తో అందిస్తున్నది. ఎయిర్‌టెల్ నుండి లభించే రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 2GB రోజువారీ డేటాను కూడా అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులకు రోజుకు 100SMSల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ.698 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న అదనపు ప్రయోజనాలు

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న అదనపు ప్రయోజనాలు

ఎయిర్‌టెల్‌ టెలికామ్ సంస్థ తన వినియోగదారులకు ప్రతి ప్లాన్‌తో డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ ప్రయోజనాలతో పాటుగా ఇతర ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తున్నాయి. ఇందులో భాగంగా కస్టమర్లు షా అకాడమీ యొక్క 1 సంవత్సరం చందా మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యొక్క సభ్యత్వాన్ని ఉచితంగా పొందటానికి అర్హులు. వీటితో పాటుగా ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీపై రూ .150 క్యాష్‌బ్యాక్ మరియు వింక్ మ్యూజిక్, ఉచిత హెలోటూన్స్ వంటివి కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లు  vs జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లు vs జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.698 ప్లాన్‌ను ఇతర టెల్‌కోస్ యొక్క ఆఫర్‌లతో పోల్చినట్లయితే చాలా వరకు తేడాలు ఉన్నాయి. ఈ ప్లాన్ రిలయన్స్ జియో అందిస్తున్న రూ.599 ప్లాన్ కు సమానమైన ప్రయోజాలను కలిగి ఉన్నాయి. టెల్కో యొక్క ఈ ప్లాన్ 2 జీబీ డైలీ డేటాను 84 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ అందిస్తున్న దానికంటే తక్కువ ధరకే లభిస్తుంది. రిలయన్స్ జియో కస్టమర్ కేవలం 599 రూపాయల ప్లాన్‌తో 1GB డేటాను కేవలం 3.5 రూపాయలకు పొందుతాడు. ఇది ఎయిర్టెల్ యొక్క రూ .4.15 కన్నా చాలా తక్కువ.

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లు  vs వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లు vs వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ప్రస్తుతం VI రీబ్రాండ్ మార్చబడిన తరువాత వోడాఫోన్ ఐడియా కూడా తన వినియోగదారులకు రూ.699 ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నది. రూ.699 ప్లాన్ వాస్తవానికి 84 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటాను వినియోగదారులకు అందించవలసి ఉంది. కానీ VI యొక్క ‘డబుల్ డేటా ఆఫర్'లో భాగంగా రోజుకు 4GB డేటా ప్రయోజనంను అందిస్తున్నది. కాబట్టి 2GB రోజువారీ డేటాకు బదులుగా వినియోగదారులు 84 రోజులకు ప్రతిరోజూ 4GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ యొక్క రూ.698 ప్లాన్ కంటే కేవలం 1రూపాయి మాత్రమే ఎక్కువ. కానీ జియో రూ.599 ప్లాన్‌తో పోలిస్తే ఇది రూ.100 ఎక్కువ. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 1GB డేటా కేవలం 2.08 రూపాయలకు లభిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే డబుల్ డేటా ఆఫర్ అందించే సమయం వరకు వోడాఫోన్ ఐడియా యొక్క VI ప్లాన్ మిగిలిన అన్నిటికంటే చౌకైన ఎంపిక. కానీ ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత ఇది అత్యంత ఖరీదైనదిగా మారుతుంది.

Best Mobiles in India

English summary
Airtel Great Offers: 1GB Data Now Available at Just Rs 4.15 Only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X