Home
News

ఎయిర్‌టెల్ అత్యాశకు హద్దే లేదా.. పాపులర్ ప్లాన్లలో డేటా మాయం.. యూజర్ల ఆగ్రహం!

భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. ట్రాయ్ (TRAI) కొత్త నిబంధనల పేరుతో ఉన్న ప్లాన్లలో డేటాను తీసేసి, కేవలం వాయిస్, SMS మాత్రమే అందిస్తోంది. దీంతో, కొద్దిపాటి డేటా వాడుకునే కస్టమర్లు లబోదిబోమంటున్నారు. వాట్సాప్ చెక్ చేసుకోవడానికి కూడా డేటా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి భారతీ ఎయిర్‌టెల్ ప్రజలను ఎలాంటి షాక్ గురిచేసిందో ఒకసారి చూద్దాం.

Airtel Greed Exposed  Data Removed from Popular Plan  Users Left Disappointed

* ఎయిర్‌టెల్ పాపులర్ ప్లాన్స్.. డేటా మాయం..

ఎయిర్‌టెల్ అందిస్తున్న పాపులర్ ప్లాన్లలో రూ. 509 ప్లాన్ ఒకటి. ఇంతకుముందు ఇది అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలతో పాటు 6GB డేటా ఆఫర్ చేసేది.

కాగా ఇప్పుడు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMS మాత్రమే లభిస్తున్నాయి. కనీసం సింగిల్ GB డేటా కూడా ఆఫర్ చేయడం లేదు. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ కంటెంట్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, హలో ట్యూన్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. వ్యాలిడిటీ: 84 రోజులు. అంటే నెలకి సుమారు రూ.167 (ఎయిర్‌టెల్ లెక్కల ప్రకారం).

* ఎయిర్‌టెల్ రూ.1,999 ప్లాన్

ఇది కూడా చాలా పాపులర్ ప్లాన్. ఈ ప్లాన్ కింద ఇంతకుముందు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3,600 SMSలతో పాటు 24GB డేటా లభించేది. ఇప్పుడు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3,600 SMS మాత్రమే లభిస్తాయి. డేటా రాదు.

ఇతర ప్రయోజనాలు: పైన చెప్పినట్టే, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ఉచిత కంటెంట్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్స్.

వ్యాలిడిటీ: 365 రోజులు.

* ధర తగ్గించకుండా.. డేటా మాయం..

ఎయిర్‌టెల్ ఈ ప్లాన్లలో డేటాను తీసేసింది కానీ, ధరలు మాత్రం తగ్గించలేదు. దీని వెనుక అసలు కారణం, యూజర్ల నుంచి వచ్చే ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే. ఎయిర్‌టెల్ ARPU టార్గెట్ రూ.300కి చేరుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంది.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు వాడేవారు, సెకండరీ డివైజ్‌లు వాడుకునేవారు వీటినే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఇకపై వారు డేటా కోసం ఎక్స్‌ట్రా మనీ చెల్లించుకోక తప్పదు.

* డేటా కావాలంటే.. అడిషనల్ ప్యాక్‌లు..

డేటా తీసేసిన ఎయిర్‌టెల్, డేటా కావాలంటే అడిషనల్ ప్యాక్‌లు కొనుక్కోమంటోంది. ఆ ప్యాక్‌లు ఏవంటే,

* రూ.161: 12GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ. డేటా అయిపోతే 50 పైసలు/MB.

* రూ.121: 5GB డేటా, బేస్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు. డేటా అయిపోతే 50 పైసలు/MB.

* రూ.99: 2 రోజుల అన్‌లిమిటెడ్ డేటా (20GB తర్వాత స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది).

* రూ.49: 1 రోజు అన్‌లిమిటెడ్ డేటా (20GB తర్వాత స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది).

* రూ.33: 2GB డేటా, 1 రోజు వ్యాలిడిటీ. డేటా అయిపోతే 50 పైసలు/MB.

* రూ.22: 1GB డేటా, 1 రోజు వ్యాలిడిటీ. డేటా అయిపోతే 50 పైసలు/MB.

* కస్టమర్ల ఆగ్రహం

ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ నిర్ణయంపై కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేటా లేకుండా ప్లాన్స్ ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నిస్తున్నారు. ఫీచర్ ఫోన్ వాడేవారికి ఈ ప్లాన్స్ సరిపోవచ్చు కానీ, స్మార్ట్‌ఫోన్ వాడేవారికి మాత్రం డేటా అవసరం కదా అని అంటున్నారు.

ట్రాయ్, వాయిస్ కాల్స్, SMS మాత్రమే ఉపయోగించే వారి కోసం డేటా లేని ప్లాన్‌లను అందించాలని, అలాగే డేటా తొలగించినందుకు ధరలను తగ్గించాలని టెలికాం కంపెనీలను కోరింది. అయితే ధరలు తగ్గించకుండా, డేటా తీసేయడం వెనుక ఎయిర్‌టెల్ స్వార్థం, అత్యాశ ఉన్నాయని కస్టమర్లు మండిపడుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel removed data from popular prepaid plans, offering only voice and SMS. Customers are upset as prices remain unchanged. Data add-ons are available separately. Users see this as a profit-driven move by Airtel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X