రూ. 249తో నాలుగు లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ పొందండి

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం రంగం ఒక్కసారిగా మారిపోయింది. ఉచిత డేటా, వాయిస్ కాల్స్ తో సునామిలా దూసుకువచ్చిన జియో దెబ్బకు అప్పటి వర

|

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం రంగం ఒక్కసారిగా మారిపోయింది. ఉచిత డేటా, వాయిస్ కాల్స్ తో సునామిలా దూసుకువచ్చిన జియో దెబ్బకు అప్పటి వరకు మకుటం లేని మారాజులుగా వెలుగొందిన టాప్ దిగ్గజాలు సైతం కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. జియో ఉచితం తర్వాత డేటాపై టారిఫ్ ధరలను ప్రకటించడంతో టెల్కోలు కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. జియోతో పోటీగా ప్లాన్లను అందిస్తూ వినియోగదారులను తమ నెట్ వర్క్ నుండి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.

 
రూ. 249తో నాలుగు లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ పొందండి

ఈ నేపథ్యంలోనే దిగ్గజ సంస్థ ఎయిర్ టెల్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియోకు షాకిస్తూ తన ప్లాన్లలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్యాకేజిని అందిస్తోంది. ప్యాకేజి వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్

రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. భారతదేశంలోని యూజర్లందరికీ ఈ రెండు ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. ఆ ప్లాన్లే రూ.129, రూ.249. అయితే ఈ ప్లాన్లలో ఓ ప్లాన్ కు కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని అందిస్తోంది.

రూ. 249 ప్లాన్

ఇందులో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవినియోగదారులకి రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. దీంతో పాటు రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, నేషనల్ రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ

ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రూ.249 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఎవ్వరు ఇవ్వలేని విధంగా
 

ఎవ్వరు ఇవ్వలేని విధంగా

రూ.249 ప్లాన్‌లో ఇప్పటివరకు ఎవ్వరు ఇవ్వలేని విధంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజిని ఎయిర్ టెల్ అందిస్తోంది. రూ.249 ప్లాన్‌పై ఏకంగా రూ.4 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తోంది.హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ లేదా భారతీ ఆక్సా నుంచి ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది.ఒకసారి రీఛార్జ్ చేసుకున్నవారి మొబైల్‌కు పాలసీకి సంబంధించిన ఎస్ఎంఎస్ వస్తుంది.

 

 

క్లెయిమ్ ఎలా ?

క్లెయిమ్ ఎలా ?

ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంట‌నే క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివ‌రాలు ఉంటాయి. వాటిని న‌మోదు చేస్తే క‌స్ట‌మ‌ర్ తన ఫోన్ లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాల‌సీ కాపీని పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఆక్సా నుంచి ఆ పాల‌సీ ఇష్యూ అవుతుంది.వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎయిర్‌టెల్ యాప్‌ నుంచి కస్టమర్లు పాలసీకి సంబంధించిన కాపీని పొందవచ్చు.

ప్లాన్ వివరాలు క్లుప్తంగా

ప్లాన్ వివరాలు క్లుప్తంగా

రూ.129 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.129 కు మ‌రో నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో క‌స్ట‌మ‌ర్లకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. కాగా రూ.249, రూ.129 ప్లాన్ల వాలిడిటీని 28 రోజులుగా

ప్లాన్ వివరాలు క్లుప్తంగా

* రూ.249 ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటాతోపాటు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

* ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ టీవీ ప్రిమియం సేవ‌లు, జీ5, లైవ్ చాన‌ల్స్‌, సినిమాలు, ఏడాదిపాటు నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవ‌లు, వింక్ సభ్యత్వం ఉచితంగా ల‌భిస్తాయి.

* ఈ ప్లాన్‌తోపాటు రూ.129 కు మ‌రో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌లో క‌స్టమ‌ర్లకు రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

 

Best Mobiles in India

English summary
Airtel Has a New Rs 249 Prepaid Recharge Plan With Rs 4 Lakhs Life Insurance Bundled

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X