ఎయిర్‌టెల్ ఆఫర్‌తో రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

|

ఐటెల్ బ్రాండ్‌తో చేతులు కలిపిన భారతీ ఎయిర్‌టెల్ రెండు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ 4జీ
స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఐటెల్ ఏ40 4జీ, ఐటెల్ ఏ41 4జీ మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

 
ఎయిర్‌టెల్ ఆఫర్‌తో రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లో ఐటెల్ ఏ40 4జీ ఫోన్ వాస్తవ ధర రూ.4,599గా ఉంది. ఎయిర్‌టెల్ 'మేరా పెహలా స్మార్ట్‌ఫోన్’ ఇనీషియేటివ్ క్రింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయటం ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్ ఎయిర్‌టెల్ యూజర్లకు లభిస్తుంది. దీంతో రూ.3,099కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే వీలుంటుంది.

ఎయిర్‌టెల్ బండిల్ ప్యాక్‌తో లభ్యం...

ఎయిర్‌టెల్ బండిల్ ప్యాక్‌తో లభ్యం...

మరో మోడల్ ఐటెల్ ఏ41 ఒరిజినల్ ధర రూ.4,699గా ఉంది. రూ.1500 క్యాష్‌‌బ్యాక్ పోనూ రూ.3,199కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే వీలుంటుంది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లను ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ఎయిర్‌టెల్ ‘మేరా పెహలా స్మార్ట్‌ఫోన్' ఇనీషియేటివ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రెండు

స్మార్ట్‌ఫోన్‌లు రూ.169 మంత్లీ రీఛార్జ్ ప్యాక్‌తో లభ్యమవుతాయి. ఈ ప్యాక్‌లో నెల మొత్తం సరిపోయే విధంగా వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటే డేటా బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

మొత్తం డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది..?

మొత్తం డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది..?

ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవాలనుకునే ఎయిర్‌టెల్ యూజర్లు ముందుగా ఒరిజనల్ ధరలను చెల్లించి ఫోన్‌లను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. రూ.1500 క్యాష్‌బ్యాక్ అనేది 18 నెలలకు ఒకసారి చొప్పున రెండు విడతలుగా యూజర్‌కు లభిస్తుంది.

మొదటి క్యాష్‌బ్యాక్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా రూ.500, రెండవ క్యాష్‌బ్యాక్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా రూ.1000 యూజర్ ఖాతాలో జమ అవుతుంది. యూజర్ తాను కొనుగోలు చేసిన ఫోన్ పై పూర్తి క్యాష్‌బ్యాక్‌ను పొందాలంటే 36 నెలల పూర్తయ్యేలోపు రూ.4000 విలువల గల రీఛార్జులను చేసుకోవల్సి ఉంటుంది.

జనవరి 26న వస్తోన్న...వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ !జనవరి 26న వస్తోన్న...వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ !

ఐటెల్ ఏ40 స్పెసిఫికేషన్స్...
 

ఐటెల్ ఏ40 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 480x 854 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,400mAh బ్యాటరీ.

 ఐటెల్ ఏ41 స్పెసిఫికేషన్స్...

ఐటెల్ ఏ41 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 480x 854 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,400mAh బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel has now joined hands with itel to launch two new budget 4G smartphones -- itel A40 4G and itel A41 in India today. The new itel A40 4G and itel A41 are announced at an effective price tag of Rs 3,099 and Rs 3,199 respectively.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X