ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుండి అదనపు డేటా ఆఫర్‌ను తొలగించింది...

|

భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ యొక్క అభివృద్ధిలో భాగంగా ఇటీవల దాని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు అదనపు ప్రయోజనంగా అందిస్తున్న కొన్ని డేటా ప్రయోజనాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. టెలికాం దిగ్గజం తమ ప్లాన్‌లను పోల్చి చూసుకునేటప్పుడు మరియు ఎంచుకునే సమయంలో కస్టమర్‌ల గందరగోళాన్ని నివారించడంలో ఈ చర్య సహాయపడుతుందని పేర్కొంది. ముందుగా నివేదించినట్లుగా ఎయిర్‌టెల్ తన ప్లాన్‌ల ధరలను దాదాపు 20% - 25% వరకు పెంచింది. ఇందులో టారిఫ్డ్ వాయిస్ మరియు డేటా టాప్-అప్‌లు ఉన్నాయి. కొత్త ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి.

Airtel నుండి ఉపసంహరించబడిన ప్రమోషనల్ కూపన్‌లు

Airtel నుండి ఉపసంహరించబడిన ప్రమోషనల్ కూపన్‌లు

ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు ఎంపిక చేసిన ప్లాన్‌లపై అదనంగా 500MB డేటాను ప్రమోషనల్ కూపన్‌లుగా అందిస్తోంది. అయితే ఒక ఇమెయిల్ విచారణకు ప్రతిస్పందనగా టెలికాం కంపెనీలు తమ యాప్‌ల ద్వారా ప్రమోషనల్ కూపన్‌లు లేదా అదనపు ప్రయోజనాలను అందించడం ఆచరణలో ఉందని ఎయిర్‌టెల్ అధికారి ఒకరు తెలియజేశారు. అయితే కొన్ని ప్లాన్‌లను పోల్చి చూసేటప్పుడు కస్టమర్ల మనస్సుల్లో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉన్నందున ఈ ఆఫర్‌లు ప్రస్తుతం ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు.

500 MB ఉచిత ఆఫర్‌

500 MB ఉచిత ఆఫర్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయడం చాలా సులభం. వారు చేయాల్సిందల్లా ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడం మరియు వారికి అవసరమైనప్పుడు 500MB అదనపు డేటాను యాక్సెస్ చేయడం. ఈ ప్రమోషనల్ కూపన్‌ను కలిగి ఉన్న ప్లాన్‌లు రూ.719, రూ.299, రూ.265 మరియు రూ. 839 ధరల వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలతో అందిస్తోంది. ఈ ఆఫర్‌ను ముందుగా ఎయిర్‌టెల్ తన రూ. 249 ప్లాన్‌పై అందించింది. అది తర్వాత ప్రస్తుత రూ.299 ప్లాన్‌గా మారింది.

టారిఫ్‌ల పెరుగుదల
 

అంతేకాకుండా టెల్కో దిగ్గజం తన టారిఫ్‌ల పెరుగుదలను ప్రకటించినప్పుడు మూలధనంపై సహేతుకమైన రాబడిని పొందాలంటే కంపెనీ తన ప్రస్తుత సగటు ఆదాయాన్ని (ARPU) కనీసం రూ.200 మరియు తరువాత రూ.300కి పొందాలని కంపెనీ తెలియజేసింది. ఎంటిటీ ఆర్థిక ఆరోగ్యాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఎయిర్‌టెల్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం వారు ఈ స్థాయి ARPUని కొనసాగించాలని చూస్తున్నారు. ఇది నెట్‌వర్క్‌లు మరియు స్పెక్ట్రమ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి మరింత వీలు కల్పిస్తుంది. అదనంగా ఇది దేశంలో ఎయిర్‌టెల్ వారి 5G సేవలను అమలు చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఎయిర్‌టెల్ ఇటీవలి టారిఫ్ పెంపు తమ ప్లాన్‌కు మొదటి అడుగు అని మరియు దానిని 'రీబ్యాలెన్స్' టారిఫ్‌లుగా పేర్కొంది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్  తో అదనపు డేటా

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో అదనపు డేటా

భారతి ఎయిర్‌టెల్ రూ.249 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో లభించే అన్ని పాత ప్రయోజనాలను అలాగే ఉంచింది. అయితే అదనంగా ప్రతిరోజూ 500MB అదనపు డేటాను జోడించింది. సాధారణంగా రూ.249 ప్లాన్‌తో వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలతో పాటు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలలో ప్రతిరోజూ అదనంగా 500MB డేటాను కలిగి ఉంటాయి. వీటిని నేరుగా Airtel థాంక్స్ మొబైల్ యాప్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. దీని అర్థం ప్రభావవంతంగా ప్లాన్‌తో వినియోగదారులు 2GB రోజువారీ డేటాను పొందుతారని అర్థం. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అంటే మొత్తం చెల్లుబాటు కాలంలో 42GB డేటాను పొందే బదులు వినియోగదారులు ఇప్పుడు 56GB డేటాను పొందుతారు.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు

** రూ.79 ప్లాన్ రూ.99కి పెంపు: రూ.99 విలువైన టాక్‌టైమ్ మరియు 200MB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

** రూ.149 ప్లాన్ రూ.179కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.219 ప్లాన్ రూ.265కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1GB డేటాను అందిస్తుంది.

** రూ.249 ప్లాన్ రూ.299కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.298 ప్లాన్ రూ.359కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.399 ప్లాన్ రూ.479కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.449 ప్లాన్ రూ.549కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.379 ప్లాన్ రూ.455కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 6GB డేటాను అందిస్తుంది.

** రూ.598 ప్లాన్ రూ.719కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.698 ప్లాన్ రూ.839కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.1498 ప్లాన్ రూ.1799కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 24GB డేటాను అందిస్తుంది.

** రూ.2498 ప్లాన్ రూ.2999కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Airtel Has Removed The Additional Data Offer From Prepaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X