జియోకి కౌంటర్, మేము ఫ్రీ కాల్స్ ఇస్తాం !

Written By:

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మార్పులతో పాటు దిగ్గజాల మధ్య టారిప్ వార్‌తో టెలికం రంగం వేడెక్కుతోంది.ఇప్పుడు కష్టమర్ల చూపు అంతా ఉచితం మీదనే ఉంది. ఏ కంపెనీ ఉచిత ఆఫర్లను అందిస్తుందో దానివైపు వారు ఆకర్షితులవుతున్నారు. జియో మూడు నెలల ఉచిత ఆఫర్ తో దిగ్గజాలకు సవాల్ విసిరితే టెల్కోలు కూడా అదే స్థాయిలో సవాల్ విసురుతున్నాయి. ఆఫర్ల లిస్టుపై ఓ లుక్కేయండి.

డెబిట్ , క్రెడిట్ కార్డులు వాడేవారికి శుభవార్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో టారిఫ్ ప్లాన్

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అయిపోయిన తర్వాత జియో ప్రధాన డేటా ప్యాక్ రూ. 149తో మొదలవుతుందన్న విషయం తెలిసిందే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్ లో అపరిమిత కాల్స్ తో పాటు 0.3 ఎంబీ 4 జీ డేటా కూడా లభిస్తుంది. అయితే ఆ ప్లాన్ టార్గెట్ గా అన్ని కంపెనీలు సరికొత్త ఆఫర్లకు తెరలేపాయి.

ఆర్ కామ్

జియో దూకుడుకు ముందుగా తమ్ముడు అనిల్ అంబాని ధీటైన జవాబిచ్చారు. రూ. 149 ధరలో అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టిడీ కాల్స్ తో పాటు 300 ఎంబీ డేటాను కూడా ప్రకటించారు. 28 రోజుల పాటు పుల్ గా ఎంజాయ్ చేయమంటూ చెప్పారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిఎస్ఎన్ఎల్ దూకుడు

ఇదే బాటలో బిఎస్ఎన్ఎల్ కూడా ముందుకు వస్తోంది. జనవరి 1 నుంచి రూ. 149 కే అన్‌లిమిటెడ్ వాయిస్ ప్యాక్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పరిమిత డేటాను కూడా అందించే అవకాశం ఉంది.

ఎయిర్‌టెల్

ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఈ వరసలోకి దూసుకొచ్చింది. రూ. 149కే అన్ లిమిటెడ్ ఎస్టీడీ ,లోకల్ కాల్స్ ను ప్రవేశపెడుతోంది. అయితే ఇది ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ మాత్రమే. దీంతో పాటు మరో ప్లాన్ కూడా తీసుకొస్తోంది. రూ. 349తో 1జిబి 4జీ/3జీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఏ నెట్ వర్క్ కైనా చేసుకోవచ్చని చెబుతోంది. 28 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుందని చెబుతోంది.

టెలినార్

టెలినార్ తన సొంత నెట్వర్క్లో అన్లిమిటెడ్ కాల్ ప్యాక్స్ను తీసుకొచ్చింది. టెలికం సర్కిల్లో టెలినార్ నుంచి టెలినార్కు రూ .64 ప్యాక్తో 28 రోజుల పాటు ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు.

ఐడియా

ఐడియా నుంచి ఐడియాకు అపరిమిత లోకల్ కాల్స్ను 28 రోజుల వాలిడిటీతో రూ .247 ధరలో ప్యాక్ను పొందవచ్చు. లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ ప్యాక్ రూ .698 ధరలో ఉంది.

వొడాఫోన్

వొడాఫోన్ రూ .349 ప్యాక్లో సొంత నెట్వర్క్లో లోకల్ కాల్స్ను అందిస్తోంది. దీంతో పాటు రూ. 225 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే వారికి అంతకు అంత జిబి ఉచితంగా లభిస్తుంది. 1జిబి డేటా వేస్తే మీకు 1జిబి డేటా అదనంగా లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel, Idea bsnl vodafone launch schemes to counter Jio tariff read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot