మోగనున్న కాల్ రేట్లు, గుండెలు బాదుకుంటున్న జియో..

Written By:

ఎవరికైనా కాల్ చేయాలనుకుంటున్నారా..ఓ సారి బ్యాలన్స్ చూసుకోండి. ఎందుకంటే త్వరలో కాల్‌ రేట్లు మోతమోగనున్నాయి. ఎందుకంటే ఇంటర్‌కనెక్షన్‌ యూసేజ్‌ ఛార్జీలను(ఐయూసీ) రెండింతలు పెంచాలని టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌లు ప్రతిపాదించాయి. దీనికి వొడాఫోన్ కూడా సై అంది.

జియో ఎఫెక్ట్ , ఎయిర్‌సెల్ పరిమితి లేని ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను

మొబైల్‌ కాల్‌ రేట్లకు ఐయూసీ కీలక ఇన్‌పుట్‌. తమ నెట్‌వర్క్‌లకు వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను టర్మినేట్‌ చేయడానికి నిమిషానికి 30 పైసలు వసూలుచేయాలని నిర్ణయించాలని దిగ్గజాలు నిర్ణయించాయి.

వొడాఫోన్‌ కూడా

మరో టెలికాం కంపెనీ వొడాఫోన్‌ కూడా ఈ రేటును ప్రస్తుతమున్న దానికంటే రెండింతలు ఎక్కువగా 34 పైసలుగా ప్రతిపాదించింది.

డైరెక్ట్‌గా మొబైల్‌ కాల్‌ రేట్లపై

ఈ ప్రభావం డైరెక్ట్‌గా మొబైల్‌ కాల్‌ రేట్లపై పడనుందని తెలుస్తోంది. ఐయూసీలో ఎలాంటి మార్పు వచ్చిన తొలుత ప్రభావితమయ్యేది మొబైల్‌ కాల్స్‌ రేట్లే. ఈ ఛార్జీలతోనే టెలికాం కంపెనీలు టారిఫ్‌లను నిర్ణయిస్తాయి.

ఐయూసీ రివ్యూ వర్క్‌షాపులో

టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ నిర్వహించిన ఐయూసీ రివ్యూ వర్క్‌షాపులో ఈ ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించినట్టు టెలికాం ఆపరేటర్లకు చెందిన ఓ అధికారి చెప్పారు.

ప్రతి ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు

ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ప్రతి ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు ఇంటర్‌కనెక్షన్‌ ఛార్జీ కింద వీటిని వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు చెల్లించే ఛార్జీల్లోనే కలిసి ఉంటాయి. ఐయూసీను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ నిర్ణయిస్తోంది.

ఇన్‌కమింగ్‌ కాల్స్‌ లోడ్‌ వ్యయాలను

ప్రస్తుతం ప్రతి ఇన్‌కమింగ్‌ కాల్‌కు నిమిషానికి 14 పైసల ఐయూసీ ఉంది. ఈ రేట్ల పెంపుతో టెలికాం ఆపరేటర్లు ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ లోడ్‌ వ్యయాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి.

ఇన్‌కమింగ్‌ కాల్స్‌పై ఎలాంటి ఛార్జీలు

ట్రాయ్‌ నిర్వహించిన సమావేశంలో టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ జియో కూడా పాల్గొంది. అయితే ఇన్‌కమింగ్‌ కాల్స్‌పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని జియో పోరాడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel, Idea, Vodafone push for doubling mobile call termination charge Read More At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting