Home
News

Airtel ఈ రెండు రీఛార్జి ప్లాన్ల ధరలు పెంచింది! కొత్త ధరలు, ప్రయోజనాలు

ప్రముఖ భారతీయ టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ద్వారా ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయాన్ని (ARPU) పెంచడం మరియు మొత్తం మీద పెట్టుబడులపై మెరుగైన రాబడిని పొందడం వంటి లక్ష్యాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ నిశ్శబ్దంగా రూ.118 మరియు రూ.289 ప్లాన్‌ల ధరలను పెంచింది. 4G డేటా వోచర్ అయిన రూ.118 ప్లాన్ ఇప్పుడు రూ.129 గా ఉంది. అలాగే, రూ.289 ప్లాన్ ధర ఇప్పుడు రూ.329 గా ఉంది. ఈ మార్పులు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో కూడా ప్రతిబింబిస్తాయి. ఈ ప్లాన్‌లను వాటి అప్‌డేట్ చేసిన ధరలు మరియు ప్రయోజనాల వివరాలు ఇక్కడ చూద్దాం.

Airtel Increases Price Of These Two Recharge Plans  New Price And Benefits Details Here

ఎయిర్‌టెల్ యొక్క రూ. 129 ప్లాన్ వివరాలు
భారతీ ఎయిర్‌టెల్ యొక్క రూ.129 ప్లాన్ 12GB డేటాతో వస్తుంది. ఇది ఒకేసారి మొత్తం డేటా ను వినియోగదారులకు అందిస్తుంది. మరియు వినియోగదారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డేటా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ వలె ఉంటుంది.

ఈ ప్లాన్‌తో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు ఇది డేటా ప్లాన్ మాత్రమే.ఈ ప్లాన్ ధర రూ.118 నుండి రూ.129 కి పెరిగింది కానీ డేటా పెంచలేదు. అందువల్ల ఈ ప్లాన్‌తో ప్రతి GB డేటా ధర స్వల్పంగా రూ.9.83 నుండి రూ.10.75కి పెరుగుతుంది.

ఎయిర్‌టెల్ రూ. 329 ప్లాన్ వివరాలు
ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్ యొక్క రూ. 329 ప్లాన్, ఇంతకుముందు రూ. 289 గా ఉండేది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 4GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMS లను పొందుతారు. ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కస్టమర్‌ల కోసం ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బండిల్ చేయబడ్డాయి - Apollo 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత Hellotunes మరియు Wynk Music App యాక్సిస్ ఉంటుంది.

ఈ ధరల పెరుగుదలతో, ఈ ప్లాన్‌ను ఉపయోగించడం కోసం వినియోగదారుల రోజువారీ ఖర్చు రూ.8.25 నుండి రూ.9.4కి పెరిగింది. అయితే ఈ ప్లాన్ వినియోగదారులకు డేటాను అందించడానికి ఉద్దేశించినది కాదు. ఇది తక్కువ డేటా (4GB) మాత్రమే , మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు స్వల్పకాలిక వ్యాలిడిటీని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడిన ప్లాన్ ఇది.

ఎయిర్టెల్ కేవలం రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టడమే కాకుండా లైవ్ టీవీ మరియు OTT ప్రయోజనాలను బండిల్ చేయడం ద్వారా తన సర్వీస్ ఆఫర్‌ను కూడా విస్తరించింది. ఇంకా, ఇప్పుడు Xstream AirFiber రెండు-స్పీడ్ వేరియంట్‌లలో వస్తుంది, 40 Mbps మరియు 100 Mbps. ఇంతకుముందు, ఎయిర్‌టెల్ 100 Mbps ప్లాన్‌ను మాత్రమే అందించేది, కానీ ఇప్పుడు వినియోగదారులు ఎంచుకోవడానికి రెండు-ఇంటర్నెట్ స్పీడ్ ఎంపికలు ఉన్నాయి.

ఎయిర్టెల్ Xstream AirFiber ఇప్పుడు రూ. 699, రూ. 799 మరియు రూ. 999తో సహా మూడు ప్లాన్ ఎంపికలలో అందుబాటులో ఉంది, అన్నీ కొత్త కస్టమర్ల కోసం 6, 12 నెలల అద్దె ప్లాన్‌లలో అందుబాటులో ఉండే నెలకు ఛార్జీలు.

Airtel Xstream AirFiber రూ.699 ప్లాన్ గరిష్టంగా 40 Mbps వేగాన్ని అందిస్తోంది, అయితే రూ. 999 ప్లాన్ 100 Mbps వేగాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్‌లు 1 TB న్యాయమైన వినియోగ విధానం (FUP) పరిమితిని కలిగి ఉంటాయి, ఆ తర్వాత వేగం 2 Mbps కి తగ్గించబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Increases Price Of These Two Recharge Plans, New Price And Benefits Details Here.Bharti Airtel's Rs 329 plan, earlier used to cost Rs 289. The service validity offered with this plan is 35 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X