Disney+ Hotstar VIP చందాను ఉచితంగా అందిస్తున్న Airtel ప్లాన్‌లు ఇవే!!
ఇండియాలోని టెలికామ్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు వారి యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి. డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ ను మాత్రం ఉచితంగా కొన్ని నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మరియు డేటా వోచర్‌లతో మాత్రమే అందిస్తున్నాయి. భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో సంస్థలు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను కొన్ని ప్లాన్ లతో అందిస్తున్నాయి.

డిస్నీ+ హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ఇండియాలోని ప్రసిద్ధ OTT కంటెంట్ ప్లాట్‌ఫామ్ లో డిస్నీ + హాట్‌స్టార్ VIP కొత్తగా విడుదలైంది. ఇది వినియోగదారులకు హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలలో కూడా సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. సాధారణంగా డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క ఒక సంవత్సరం చందాను 399 రూపాయల ధర వద్ద వస్తుంది. భారతి ఎయిర్‌టెల్ రూ.401 డేటా ప్యాక్‌ను సవరించిన తరువాత ఇప్పుడు రూ.448 మరియు రూ.599 ధర వద్ద గల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ రూ .448 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను ఉచితంగా అందిస్తున్న భారతి ఎయిర్‌టెల్ యొక్క మొదటి వాయిస్ కాలింగ్ ప్లాన్ రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలంలో రోజుకు 3GB డేటాను మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను అదనంగా అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ రూ .599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
వాయిస్ కాలింగ్ బెనిఫిట్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను ఉచితంగా అందించే ఎయిర్టెల్ యొక్క రెండవ ప్లాన్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 2GB రోజువారీ డేటాను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా కస్టమర్ అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. వీటితో పాటు అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ యొక్క ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

భారతి ఎయిర్‌టెల్ రూ.2,698 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను అందించే ఎయిర్టెల్ యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్ రూ.2,698 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 100 SMSలను మరియు 2GB రోజువారీ డేటాను మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే అన్ని రకాల నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న ఇతర ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ థాంక్స్ వంటివి ఉన్నాయి. త్వరలోనే IPL 2020 మొదలుకానున్నది కావున ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారు IPL యొక్క అన్ని మ్యాచ్ లను ఆసక్తికరంగా చూడడానికి వీలుఉంటుంది.


Click it and Unblock the Notifications








