Airtel యూజర్లకు గుడ్ న్యూస్...అతి తక్కువ ధర వద్ద మరో మూడు కొత్త ప్లాన్‌లు
భారతీయ ఎయిర్‌టెల్ సంస్థ దేశంలో ఎంపిక చేసిన కొన్ని సర్కిల్‌లలో 28 రోజుల చెల్లుబాటు కాలంతో రూ.200 కంటే తక్కువ ధరతో ఇప్పుడు కొత్తగా మూడు ప్లాన్‌లను గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గోవా వంటి సర్కిల్‌లలో ప్రవేశపెట్టింది. రూ.99, రూ.129 మరియు రూ.199 ధర గల కొత్త ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు Zee5 సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌తో సహా అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి.

రూ.99 ప్లాన్ మరియు రూ.129 ప్లాన్ వినియోగదారులకు చెల్లుబాటు కాలానికి మొత్తంగా 1Gb డేటాను అందిస్తుండగా రూ.199 ప్లాన్ 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. కొన్ని సర్కిల్‌లలో వొడాఫోన్ 1GB రోజువారీ డేటాతో పాటు వోడాఫోన్ ప్లే మరియు Zee5 సభ్యత్వానికి యాక్సిస్ ను రూ.199 ధర వద్ద అందిస్తున్నది. ఇంకా రిలయన్స్ జియో కూడా 1GB రోజువారీ డేటా ప్లాన్‌ను 24 రోజుల వాలిడిటీతో రూ.149 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఎయిర్టెల్ రూ.99 ప్లాన్ 7 సర్కిల్‌లలో
ఎయిర్‌టెల్ నుంచి వచ్చిన రూ.99 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ బీహార్, జార్ఖండ్, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ వంటి సర్కిల్‌లలో లభిస్తున్నది. ఈ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 18 రోజుల చెల్లుబాటు కాలానికి 1GB డేటా, 100SMS మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా ఒరిస్సా, రాజస్థాన్, యుపి ఈస్ట్ మరియు పశ్చిమ బెంగాల్ సర్కిల్‌లలో కూడా రూ.99 ప్లాన్‌ను అందిస్తున్నారు.

ఎయిర్టెల్ రూ.129 ప్లాన్
ఎయిర్టెల్ యొక్క రూ.129 ప్లాన్ రూ .99 ప్లాన్‌తో సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీని యొక్క చెల్లుబాటు కాలం 24 రోజులు. అలాగే ఈ చెల్లుబాటు కాలంలో వినియోగదారులకు మొత్తంగా 300SMS లను పంపడానికి అనుమతి ఉంది. ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ ప్రస్తుతం అస్సాం, బీహార్ మరియు జార్ఖండ్, గుజరాత్, హర్యానా, కేరళ, కోల్‌కతా, ఎంపి మరియు ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర మరియు గోవా, నార్త్ ఈస్ట్, ఒరిస్సా, రాజస్థాన్, యుపి ఈస్ట్, యుపి వెస్ట్ మరియు ఉత్తరాఖండ్‌లతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని వినియోగదారులు ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు.

ఎయిర్టెల్ రూ 199 ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ నుండి వస్తున్న మూడవ ప్లాన్ యొక్క ధర రూ.199. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజువారీ 1GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100sms ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ తన రూ.199 ప్లాన్‌ను అస్సాం, బీహార్, జార్ఖండ్, గుజరాత్, హర్యానా, కేరళ, కోల్‌కతా, ఎంపి, ఛత్తీస్‌గడ్ సర్కిల్‌లలో 129 రూపాయల ప్లాన్‌తో సహా అందిస్తోంది. అదనంగా పశ్చిమ బెంగాల్‌తో పాటు మహారాష్ట్ర మరియు గోవా, నార్త్ ఈస్ట్, ఒరిస్సా, రాజస్థాన్, యుపి ఈస్ట్, యుపి వెస్ట్ మరియు ఉత్తరాఖండ్‌లోని వినియోగదారులకు కూడా రూ. 199 ప్లాన్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








