Home
News

Airtel Data Plans మూడు డేటా ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్‌టెల్‌.. 30 రోజుల వ్యాలిడిటీ..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల సౌకర్యం, అవసరాల కోసం అనేక రకాల ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో కాలింగ్‌, డేటా సహా వ్యాలిడిటీ కోసం ప్రత్యేక ప్లాన్‌లను కలిగి ఉంది. ఎక్కువ డేటాను వినియోగించేవారి కోసం తాజాగా ఎయిర్‌టెల్‌ మూడు డేటా ప్లాన్‌లను (Airtel Data recharge Plans 2024) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డేటా ప్లాన్‌ల వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. కేవలం డేటాను మాత్రమే కోరుకొనే వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా తాజాగా రూ.161, రూ.181, రూ.361 మూడు రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మూడు డేటా ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా ప్లాన్‌లకు ఇవి అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ప్రయోజనాల పూర్తి వివరాలు.

Airtel introduced three prepaid data recharge plans with 30 days validity full details

ఎయిర్‌టెల్‌ రూ.161 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 12GB డేటాను పొందవచ్చు. అయితే డేటా వినియోగంపై రోజువారి ఎటువంటి పరిమితులు లేవు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అంటే 1GB డేటా విలువ రూ.13 గా ఉంది. అదే రూ.181 ప్లాన్‌ ద్వారా 15GB డేటాను పొందవచ్చు. ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. ఈ ప్లాన్‌లో 1GB డేటా ధర రూ.12 గా ఉంది.

ఎయిర్‌టెల్‌ రూ.361 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 50GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా 30 రోజుల పాటు ఉంది. డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. ఈ ప్లాన్‌లో భాగంగా 1GB ధర రూ.7 గా ఉంది. వీటితోపాటు ఇప్పటికే ఎయిర్‌టెల్ రూ.211 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 30 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ 1GB డేటాను పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.49 రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ఒక్కరోజు పాటు (అర్ధరాత్రి 12 గంటల వరకు) అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. అదే రూ.33 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 2GB డేటాను పొందవచ్చు. ఒకరోజు వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు రూ.22 రీఛార్జ్‌ ప్లాన్‌తో 1GB డేటాను పొందవచ్చు. ఒక్కరోజు వ్యాలిడిటీ ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిట్‌ రీఛార్జ్ ప్లాన్ రూ.77 తో 5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులపాటు ఉంటుంది. దీంతోపాటు రూ.99 రీఛార్జ్‌తో రెండు రోజులపాటు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. అదే విధంగా రూ.26 రీఛార్జ్‌తో 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్‌ వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Airtel introduced three prepaid data recharge plans with 30 days validity full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X