తక్కువ ధరలో లభించే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల గురించి మీకు తెలియని విషయాలు

|

ఎయిర్‌టెల్ ప్రవేట్ టెల్కో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా అందరికంటే ముందంజలో ఉండడానికి తన యొక్క ఫైబర్‌నెట్ టెక్నాలజీతో తన వినియోగదారులను అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల యొక్క భవిష్యత్తుకు తీసుకువెళ్లడానికి తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. ప్రస్తుతం దాని యొక్క తాజా ఆఫర్‌లు చాలా సరసమైన ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ చాలా పోటీతత్వ ధరతో కూడిన ప్లాన్‌లను అందిస్తుంది. వినియోగదారులు దేశంలోని రెండవ అతిపెద్ద టెల్కో నుండి కొనుగోలు చేసే వారి ఫైబర్ కనెక్షన్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అనుభవించవచ్చు. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ప్లాన్‌లు చాలా అందుబాటు ధరలో సహేతుకమైనవిగా ఉండడమే కాకుండా విద్యార్థులతో సహా ఇప్పటికి పెద్ద సంఖ్యలో ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులు ఎంచుకోవడానికి వీలుగా అందుబాటు ధరలో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.1000  ధరలోపు లభించే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ.1000 ధరలోపు లభించే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఇప్పటికే అధికంగా ఉన్న పోటీ మార్కెట్‌లో వినియోగదారులను ఆకర్షించడానికి దాని ప్లాన్‌లను మరియు వారు అందించే సేవలను అప్ డేట్ చేసింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌తో ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడం వల్ల వినియోగదారులు మెరుగైన మరియు వేగవంతమైన రోజువారీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అనుభవాన్ని పొందుతున్నారు. ఎయిర్‌టెల్ 1Gbps వేగంతో వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇది వేగవంతమైన డౌన్‌లోడ్‌లు మరియు తక్కువ బఫరింగ్‌లో సహాయపడుతుంది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ యొక్క ప్లాన్‌లు చాలా చవకైన ధర వద్ద కూడా అందిస్తున్నాయి. ఈ ప్లాన్లు ఇంటిలో ఇద్దరు లేదా ముగ్గురు చదువుకునే పిల్లలు లేదా విద్యార్థులను కలిగి ఉన్న వినియోగదారుల యొక్క విస్తృత విభాగంలోని వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇందులోని ప్రాథమిక ప్లాన్‌లు రూ.499ల నుండి ప్రారంభమవుతాయి. ఇందులో ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌లో భాగంగా వింక్ మ్యూజిక్ మరియు షా అకాడమీకి సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. విద్యార్థులు రూ.499, రూ.799 మరియు రూ.999 ధర వద్ద లభించే ప్లాన్‌లను రూ.1,000లోపు విభాగంలో ఎంచుకోవచ్చు. ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలపై ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.999 ప్లాన్‌కి వెళ్లవచ్చు. ఎందుకంటే ఇది వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌తో వస్తుంది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ అందించే ఈ ప్లాన్‌లన్నీ యూజర్‌కి అపరిమిత ఇంటర్నెట్‌ని అందిస్తాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అధిక ప్రయోజనకరంగా ఉంటుంది. రూ.499 ప్లాన్‌తో వినియోగదారులు 40 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను, రూ.799 ప్లాన్‌తో 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను, రూ.999 ధర వద్ద లభించే ప్లాన్‌తో వినియోగదారులు 200 Mbps ఇంటర్నెట్‌ స్పీడ్‌ను పొందవచ్చు.

దీర్ఘకాలిక వాలిడిటీ

ఈ ప్లాన్‌లన్నీ దీర్ఘకాలిక వాలిడిటీలకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB లేదా 3300GB నెలవారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను పొందుతారు. అంతేకాకుండా FTTH (ఫైబర్ టు హోమ్) సాంకేతికత ఒక ప్రొఫెషనల్-గ్రేడ్ Wi-Fi రూటర్ మోడెమ్ ద్వారా 60 పరికరాల వరకు కనెక్ట్ చేయగల ప్రత్యేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో వస్తుంది. ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు సరసమైన ధరలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందజేస్తుందని చెప్పనవసరం లేదు. ఇది మెరుగైన కనెక్టివిటీని మరియు ఇంటర్నెట్‌లో టన్నుల కొద్ది కంటెంట్‌కు ఎటువంటి రాజీ లేకుండా యాక్సెస్‌ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్

ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్

రూ.2099 ధర వద్ద లభించే ఈ ప్లాన్ భారతీ ఎయిర్‌టెల్ తన ఎయిర్‌టెల్ బ్లాక్ కస్టమర్ల కోసం అత్యంత ఖరీదైన ఆఫర్. మీరు ప్లాన్‌ను అనుకూలీకరించవచ్చు మరియు మీకు నచ్చిన విధంగా చౌకగా లేదా ఖరీదైనదిగా చేయవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులకు 200 Mbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్‌తో వినియోగదారులు పొందే అన్ని రకాల ఓవర్-ది-టాప్ (OTT) లు మరియు అలాగే ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా పొందేందుకు అర్హులు. అంతేకాకుండా కంపెనీ ఈ ప్లాన్ ను ఎంచుకున్న తన వినియోగదారులకు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను కూడా అందిస్తుంది. నెలకు 260GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో మొత్తంగా 3 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లతో అందించబడుతుంది. ఇందులో ఒకటి ప్రాథమిక సిమ్ మరియు రెండు యాడ్-ఆన్ సిమ్‌లను అందిస్తాయి. అలాగే ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను కూడా ఉచితంగా స్వీకరించడానికి యూజర్‌లు అర్హులు అవుతారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది భారతీ ఎయిర్‌టెల్ అందించే ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్ (STB). ఇది OTT కంటెంట్ మరియు శాటిలైట్ TV కంటెంట్ రెండింటినీ వినియోగించుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు మూడు అప్‌గ్రేడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.3049 ధర వద్ద ఉండగా మిగిలిన ప్లాన్‌లు రూ.2999 మరియు రూ.2949 ధరల వద్ద లభిస్తాయి. రూ.3049 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ZEE5 ప్రీమియం మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కంపెనీ నుండి Xstream బాక్స్‌ను పొందుతారు. ఇంకా రూ. 2999 ప్లాన్‌తో Xstream బాక్స్‌ని పొందుతారు. అలాగే ఒక సంవత్సరం పాటు Amazon Prime వీడియో యొక్క OTT ప్రయోజనంను ఉచితంగా పొందుతారు. చివరగా రూ.2949 ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా Xstream బాక్స్‌ను పొందుతారు. కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ కోసం మీరు రూ.250 అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.

Best Mobiles in India

English summary
Airtel Introduced Three Broadband Plans Under Rs.1000: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X