మీరు.. ఎయిర్‌టెల్ కస్టమరా?

Posted By: Super

 మీరు.. ఎయిర్‌టెల్ కస్టమరా?

 

 

ప్రముఖ టెలికాం రంగ సంస్థ భారతి ఎయిర్‌టెల్ దేశంలోని తమ వినియోగదారులు కోసం ‘మై ఎయిర్‌టెల్’ (‘my airtel’) పేరుతో సరికొత్త అప్లికేషన్‌ను ప్రకటించింది. ఈ ఉచిత అప్లికేషన్‌ను ఎయిర్‌టెల్ అందిస్తున్న అన్ని సర్వీసులకు వర్తిస్తుంది. మొబైల్, ఫిక్సుడ్ లైన్, డీటీహెచ్, బిల్ చెక్కింగ్ , రీఛార్జ్, పేమెంట్, యాక్టివేట్, డియాక్టివేట్, అభ్యర్థనలు ఇంకా ఫిర్యాదులకు సంబంధించిన సర్వీస్‌లను ఈ అప్లికేషన్ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు కస్టమర్ కేర్‌తో పనిలేకుండా సినిమాలతో పాటు గేమ్‌లను ఆర్డర్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోదలచిన వారు airtel.in/myairtel లేదా డివైజ్ అప్లికేషన్ స్టోర్‌లోకి లాగిన్ కావల్సి ఉంది. మొబైల్ యూజర్లు 54321 నెంబరుకు ‘myairtel’ అని ఎస్ఎంఎస్ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read in English:

భారత్‌లో ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లు!

టెలీ కమ్యూనికేషన్ సర్వీస్‌లను అందిస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ భారత్‌లో 20కోట్ల మంది వినియోగదారులు సంఖ్యను దాటింది. భారతి ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న 2జీ, 3జీ, 4జీ, ఫిక్సుడ్ లైన్, డీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్, ఐపీటీవీ, డీటీహెచ్ సర్వీస్‌లను దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏకంగా 10 కోట్ల మంది కొత్త వినియోగదారులను భారతీ ఎయిర్‌టెల్ రాబట్టుకోగలిగింది. ఈ అంశం పై భారతీ ఎయిర్‌టెల్ సీఈవో(భారత్, దక్షిణ ఆసియా దేశాలు) సంజయ్ కపూర్ స్పందిస్తూ భారతీయ టెలికాం విభాగంలో తాము క్రీయాశీలక బాధ్యతలు చేపట్టటం గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పోటీ మార్కెట్‌కు అనుగుణంగా వ్యవహరించటంతో పాటు ఉత్తమమైన సేవలను వినియోగదారుకు అందించడం కారణంగానే మొదటి 14 సంవత్సరాల్లో 10 కోట్లు, తరువాతి మూడు సంవత్సరాల కాలంలో మరో 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకోగలిగినట్లు ఆయన వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot