164 జిబి డేటాతో ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్

Written By:

దేశీయ టెలికాం రంగంలో ఇప్పుడు టారిఫ్ వార్ నడుస్తోంది. దిగ్గజ టెల్కోలు తమ యూజర్లను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొత్త కొత్త టారిఫ్‌లతో రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్‌, ఎయిర్‌టెల్‌ వినియోగదారులను ఆకట్టుకోవడంలో పోటీ పడుతున్నాయి. డేటా ప్రయోజనాలను అందించడంలో టెలికాం ఆపరేటర్లు జోరుగా కదులుతున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌కు ధీటుగా రూ. 499 ధరలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రారంభించింది.

164 జిబి డేటాతో ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్

తాజాగా లాంచ్‌ చేసిన రూ. 499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్‌ లిమిటెడ్‌, లోకల్‌, రోమిండ్‌ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్‌టెల్‌ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట.ఈ క్రమంలో ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజూ లభించే 2 జీబీ డేటాను ఉపయోగించుకుని రోజూ ప్రసారమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లను ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో వీక్షించవచ్చు. బీఎస్ఎన్ఎల్ రూ.248కే 51 రోజుల పాటు రోజూ 3జీబీ డేటా ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ప్రైవసీ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే : సీఈఓ

ఐపీఎల్ సందర్భంగా జియో, ఎయిర్‌టెల్‌లు తమ తమ టీవీ యాప్‌లలో తమ వినియోగదారులకు ఉచితంగా ఐపీఎల్ వీక్షించే సదుపాయం కల్పిస్తున్న విషయం విదితమే. కాగా జియో ఇప్పటికే ఐపీఎల్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా రూ.251కే క్రికెట్ సీజన్ ప్యాక్ పేరిట ఓ నూతన ప్లాన్‌ను రీసెంట్‌గా లాంచ్ చేసింది. ఇందులో జియో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా చొప్పున మొత్తం 51 రోజుల వాలిడిటీకి గాను 102 జీబీ డేటా లభిస్తుంది. అటు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా 51 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఆ మ్యాచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా మొబైల్ యాప్‌లోనూ వీక్షించేందుకు వీలుగా జియో ప్రేక్షకుల కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది.

కాగా ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.2119కు లభిస్తున్న ఈ ప్లాన్‌లో యూజర్లకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 300 ఎంబీపీఎస్ వరకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 1200 జీబీ అల్ట్రా హై స్పీడ్ డేటా ఉచితంగా వస్తుంది. దీంతోపాటు ఎయిర్‌టెల్ ల్యాండ్‌ఫోన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటిల్లో వినియోగదారులు 30 లక్షలకు పై చిలుకు పాటలను వినవచ్చు. అలాగే టీవీ యాప్‌లో 350కి పైగా లైవ్ టీవీ చానల్స్ లేదా 10వేలకు పైగా సినిమాలు, వీడియోలను వీక్షించవచ్చు. ఇక ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి అదనంగా మరో 1000 జీబీ ఉచిత బ్రాడ్‌బ్యాండ్ డేటాను అందిస్తున్నారు. అలాగే ఈ ప్లాన్‌కు డేటా రోల్ ఓవర్ ఫీచర్‌ను కూడా అందజేస్తున్నారు.

English summary
Airtel introduces new Rs 499 prepaid plan; offers 164GB data for 82 days More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot