ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అందుబాటులో!! ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకోవడం ఎలా?

|

ఇండియాలోని టెలికాం రంగంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ విభాగంలో కూడా తన యొక్క సేవలను అందిస్తున్నది. అయితే ఇప్పుడు మరొక రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన యాక్సిస్ బ్యాంక్ తో ఎయిర్‌టెల్ సంస్థ కలిసి భారత మార్కెట్ కోసం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది. 'ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కార్డు భారతీ ఎయిర్‌టెల్ యొక్క 340 మిలియన్ల కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలతో వస్తుంది. ఈ కార్డ్‌తో బై నౌ పే లేటర్ ఆఫర్‌లు, ప్రీ-అప్రూవ్డ్ ఇన్‌స్టంట్ లోన్‌లు వంటి మరిన్ని అనేక ప్రయోజనాలు అనుసంధానించబడి ఉంటాయి. Airtel Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుండి మీరు పొందే అన్ని రకాల ప్రయోజనాల గురించి వివరముగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ సంస్థ మొదటిసారిగా యాక్సిస్ బ్యాంక్ తో కలిసి అందించే క్రెడిట్ కార్డుతో కస్టమర్‌లు పొందే ప్రయోజనాలు కింద వివరంగా ఉన్నాయి.

** ఏదైనా ఎయిర్‌టెల్ DTH లేదా మొబైల్ రీఛార్జ్, ఎయిర్‌టెల్ Xstream ఫైబర్ లేదా ఎయిర్‌టెల్ బ్లాక్ పేమెంట్లపై 25% క్యాష్‌బ్యాక్.

** Zomato, Swiggy మరియు BigBasket వంటి వ్యాపారులతో ఖర్చు చేయడంపై 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

** ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా కరెంట్/ వాటర్ బిల్లు/గ్యాస్ వంటి పేమెంట్లపై 10% క్యాష్‌బ్యాక్.

** అలాగే వినియోగదారులు ఉపయోగించే ఇతర ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్.

** జారీ చేసిన 30 రోజులలోపు కార్డ్ యాక్టివేషన్‌పై రూ.500 విలువైన అమెజాన్ ఇ-వోచర్ ఉచితంగా లభిస్తుంది.

 

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును పొందాలనుకునే వినియోగదారులు అర్హత ఉన్న కస్టమర్‌లందరూ తమ యొక్క మొబైల్ ఫోన్ లోని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా సులభంగా ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్
 

ఎయిర్‌టెల్ మరియు యాక్సిస్ బ్యాంక్ యొక్క భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి భారతీ ఎయిర్‌టెల్ యొక్క డిజిటల్ సేవల సూట్ అయిన Airtel IQ, వీడియో, స్ట్రీమింగ్, వాయిస్, వర్చువల్ కాంటాక్ట్ సెంటర్ సొల్యూషన్స్ మరియు కాల్ మాస్కింగ్ సేవలు లేదా డిజిటల్ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. ఇంకా రెండు కంపెనీలు భవిష్యత్తులో డేటా సెంటర్ మరియు క్లౌడ్ సేవలలో కూడా సహకరించుకుంటాయని తెలిపింది. ఇది భారతీ ఎయిర్‌టెల్ మరియు యాక్సిస్ బ్యాంక్ రెండింటికీ అర్ధవంతమైన భాగస్వామ్యంగా నిరూపించబడాలి. ఎందుకంటే ఈ చర్య ద్వారా రెండు కంపెనీలు తమ కస్టమర్ బేస్‌ను విస్తరించుకుంటాయి. ప్రస్తుతం తన కస్టమర్లకు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ కావడం విశేషం. Airtelతో అనుబంధం లేని కస్టమర్‌లు కంపెనీ నుండి ఈ కార్డ్‌ని పొందలేరు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ ధరలు మరియు ఫీచర్లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ ధరలు మరియు ఫీచర్లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్ రెండు వేర్వేరు ధరలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. వినియోగదారులు నెలవారీ ఎంపికకు ఎంచుకుంటే కనుక దీనిని రూ.149 ధర వద్ద పొందవచ్చు. అలాగే వార్షిక ఎంపిక విధానాన్ని ఎంచుకుంటే కనుక దీనిని రూ.1499 ధర వద్ద పొందవచ్చు. వినియోగదారులు వార్షిక ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక వారికి నెలవారీ ధర రూ. 125కి తగ్గుతుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో వినియోగదారులు Eros Now, SonyLIV, Hoichoi, ShemarooMe, Lionsgate Play, Ultra, EpicON, Manorama Max, Divo, Dollywood Play, KLIKK మరియు NammaFlix వంటి OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా వరకు బాగా ప్రాచుర్యం పొందనప్పటికీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర కూడా చాలా ఎక్కువగా లేదు. మీరు బండిల్ చేయబడిన సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లకూడదనుకుంటే మీరు ఎల్లప్పుడూ ఈ ప్లాట్‌ఫారమ్‌లకు స్వతంత్ర సభ్యత్వం కోసం కూడా వెళ్లవచ్చు. Airtel Xstream వినియోగదారులకు దాని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫారమ్‌ల జాబితాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాట్‌ఫారమ్‌లకు స్వతంత్ర సభ్యత్వాన్ని కొనుగోలు చేయడానికి వారిని అనుమతిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రూ. 1499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రూ. 1499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు రూ.1499 ధర వద్ద అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. వృత్తిపరమైన ప్లాన్‌గా పేర్కొనబడిన ఇది రూ.999 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వలె అదే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ప్రయోజనాలతో వస్తుంది. డేటా మరియు కాల్ ప్రయోజనాల పరంగా ఎయిర్‌టెల్ యొక్క రూ. 1499 ప్లాన్ గరిష్టంగా 300 Mbps వేగంతో అపరిమిత డేటాను మరియు అపరిమిత కాల్‌ల ప్రయోజనాలతో అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Introducing New Credit Card With Axis Bank! Benefits and Apply Process

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X