ఎయిర్‌టెల్ IPTV.. ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, OTT, టీవీ ఛానళ్లు.. రూ.699 నుంచే ప్రారంభం..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌టెల్ IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసులను 2000 నగరాలకు విస్తరించినట్లు తెలిపింది. కేబుల్ టీవీ, DTH లకు ప్రత్యామ్నాయంగా IPTV సేవలను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ ద్వారా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. దీని ద్వారా వైఫై, టీవీ ఛానళ్లు, ఓటీటీలను కూడా పొందవచ్చు.
పెద్ద స్క్రీన్‌లో :
ఎయిర్‌టెల్ ఐపీటీవీ సర్వీసుల్లో (Airtel IPTV) భాగంగా పెద్ద స్క్రీన్‌లో మెరుగైన అనుభూతిని పొందవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్ వెబ్‌లైట్ లేదా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ స్టోర్‌ల ద్వారా ఈ సర్వీసులను పొందవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం ఎయిర్‌టెల్ వైఫై యూజర్లు కూడా IPTV కి అప్‌గ్రేడ్ కావచ్చని తెలిపింది.

30 రోజులపాటు ఉచితం :
ఇందుకు సంబంధించిన ప్లాన్‌లు రూ.699 నుంచి ప్రారంభం కానున్నాయని ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 30 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఎయిర్‌టెల్ ఐపీటీవీ లో 600 టీవీ ఛానళ్లు, హైస్పీడ్ డేటా, 26 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని తెలిపింది.
ఎన్నో ఓటీటీ యాప్స్ :
నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ టీవీ+, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనిలివ్, ZEE5 సహా మరెన్నో ఓటీటీలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ ఐపీటీవీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఢిల్లీ, రాజస్థాన్, అస్సోం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.
ఎయిల్‌టెల్ ఐపీఈవీ ప్రారంభంపై ఆ సంస్థ కనెక్టెడ్ హోమ్స్ అండ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సిద్ధార్ధ్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. సాంప్రదాయ టీవీతో కొత్త టెక్నాలతీ మరియు ఓటీటీ లను ఇంటిగ్రేట్ చేయడం యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు. ఎయిర్‌టెల్ ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్నెట్ సపోర్టుతో IPTV యూజర్లు ఆల్ ఇన్ వన్ అనుభూతిని ఆస్వాదిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరణ :
ఎయిర్‌టెల్ IPTV లో ప్రస్తుతం రూ.699 నుంచి ప్లాన్‌లు ప్రారంభం అయ్యాయి. ప్రతి ప్లాన్‌లో హైస్పీడ్ డేటా, ఓటీటీ, టీవీ ఛానళ్లను పొందవచ్చు. ప్రస్తుతానికి 6 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఎయిర్‌టెల్ చెబుతోంది.
ఎయిర్‌టెల్ ఐపీటీవీ ప్లాన్‌లు :
* రూ.699 రీఛార్జ్ ప్లాన్‌లో 40 Mbps స్పీడ్‌తో డేటా, 350 టీవీ ఛానళ్లు, 26 OTT సబ్‌స్క్రిప్షన్
* రూ.899 ప్లాన్‌లో 100 Mbps డేటా స్పీడ్, 350 టీవీ ఛానళ్లు, 26 ఓటీటీ యాప్స్
* రూ.1099 ప్లాన్‌లో 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్, 28 ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్, 350 టీవీ ఛానళ్లు,
* రూ.1599 ప్లాన్ 300 Mbbs డేటా స్పీడ్, 350 టీవీ ఛానళ్లు, 29 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్
* రూ.3999 ప్లాన్ 1 Gbps ఇంటర్నెట్ స్పీడ్, 29 OTT యాప్ సబ్‌స్క్రిప్షన్, 350 టీవీ ఛానళ్లు
ఇటీవలే శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎయిర్‌టెల్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రభుత్వం అనుమతులపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుందని తెలిపింది. స్సేస్‌ఎక్స్‌కు అనుమతులు ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇప్పటికో లో ఎర్త్ ఆర్బిట్‌లో 6000 పైగా ఉపగ్రహాలున్నాయి.


Click it and Unblock the Notifications








