Home
News

Airtel, Jio, Vi, BSNL టెలికాం ఆపరేటర్లు రూ.500లోపు అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!!!

ఇండియాలో గల టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా(Vi), మరియు బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలు ప్రస్తుతం తన వినియోగదారులకు అనేక అపరిమిత డేటా మరియు అపరిమిత వాయిస్ బెనిఫిట్స్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. అందువల్ల వాటిలో ఉత్తమమైనదాన్ని ఎన్నుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. టెల్కోస్ అన్ని కూడా రూ.500 లోపు అన్ లిమిటెడ్ ప్రయోజనాలతో అందించే సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ STV_247 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ STV_247 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

రూ .500 లోపు ధరలో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఉత్తమమైన అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి STV_247 ప్లాన్. ఈ ప్లాన్ రోజువారీ 3GB ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాతో పాటు అపరిమిత కాలింగ్ (ప్రతిరోజూ 250 నిమిషాల వరకు), మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటాను వినియోగించిన తరువాత డేటా స్పీడ్ 80 Kbps కి పడిపోతుంది. ఇంకా ఈ ప్లాన్ తో వినియోగదారులు ఈరోస్ నౌ మరియు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ యొక్క సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ సమయం 40 రోజులు మాత్రమే.

 

 

రూ .500 లోపు ఎయిర్‌టెల్ బెస్ట్ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.449

రూ .500 లోపు ఎయిర్‌టెల్ బెస్ట్ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.449

ఎయిర్‌టెల్ నుండి మీరు టెల్కో నుండి రూ .500 లోపు పొందగల ఉత్తమ అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ రూ.449 ప్లాన్. ఇది 2GB రోజువారీ FUP డేటా మరియు రోజుకు 100 SMSలతో పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, షా అకాడమీ నుండి 1 ఇయర్ ఉచిత కోర్సు, వింక్ మ్యూజిక్ వంటి అనేక ఓవర్-ది-టాప్ (OTT)లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

రూ .500 లోపు జియో బెస్ట్ రూ.444 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

రూ .500 లోపు జియో బెస్ట్ రూ.444 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

రూ .500 లోపు ధరలో రిలయన్స్ జియో నుండి వినియోగదారులుఎంచుకొనే ఉత్తమమైన అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.444 ప్లాన్ మొదటి స్థానంలో ఉంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2GB రోజువారీ FUP డేటా, రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత జియో టు జియో కాలింగ్ మరియు 2,000 FUP నిమిషాల నాన్-జియో కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ తో వినియోగదారులకు జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సిస్ ను ఉచితంగా పొందుతారు.

రూ .500 లోపు Vi బెస్ట్ రూ.449 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

రూ .500 లోపు Vi బెస్ట్ రూ.449 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్

Vi టెలికాం ఆపరేటర్ నుండి రూ .500 లోపు ధర వద్ద వస్తున్న రూ.449 ప్లాన్ వినియోగదారులకు ఉత్తమమైన అపరిమిత ప్రయోజనాలను అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ‘డబుల్ డేటా' ఆఫర్ కారణంగా రోజువారీ 4GB FUP డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు Vi నుండి లభించే ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో Vi మూవీస్ & టివి యొక్క OTT ప్రయోజనంను ఉచితంగా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi, BSNL Telecom Operators Offers Best prepaid plans Under Rs.500
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X