Home
News

Airtel, Jio, Vi ఆపరేటర్‌లు ప్రీపెయిడ్ ప్లాన్లతో అందిస్తున్న OTT ప్రయోజనాలు ఇవే...

ఇండియాలోని టెలికాం ఆపరేటర్‌లు అన్ని కూడా ప్రస్తుత ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి మరియు వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి తమ ప్రీపెయిడ్ ప్లాన్లతో ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను ఉచితంగా అందించడం సర్వసాధారణం అయింది. చాలా రకాల OTT ప్లాట్‌ఫారమ్‌లు టెలికాం ఆపరేటర్‌లతో భాగస్వామ్యం అవ్వడంతో వారి కంటెంట్ లైబ్రరీని వినియోగదారులకు ఉచితంగా లేదా రాయితీ ధర వద్ద అందిస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ వంటి టెల్కోస్ అన్నీ కూడా తమ వినియోగదారులకు ప్రీపెయిడ్ ప్లాన్లతో OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి. OTT ప్రయోజనాలతో జాబితా చేయబడిన టెల్కోస్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OTT ప్రయోజనాలతో లభించే ఉత్తమమైన జియో ప్రీపెయిడ్ ప్లాన్లు

OTT ప్రయోజనాలతో లభించే ఉత్తమమైన జియో ప్రీపెయిడ్ ప్లాన్లు

రిలయన్స్ జియో యొక్క రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది డిస్నీ + హాట్స్టార్ VIP యొక్క OTT ప్రయోజనంతో పాటు 2GB రోజువారీ డేటాను ఉచితంగా అందిస్తుంది. అలాగే రూ.777 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాతో పాటుగా డిస్నీ + హాట్స్టార్ VIP చందాను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ లు అపరిమిత కాలింగ్ మరియు పరిమిత FUP నిమిషాలతో పాటుగా జియో సినిమా, జియో సావన్ వంటి యాప్ లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

OTT ప్రయోజనాలతో లభించే ఉత్తమ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లు

OTT ప్రయోజనాలతో లభించే ఉత్తమ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లు

ఎయిర్టెల్ యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి 2GB రోజువారీ డేటాతో పాటుగా వినియోగదారులకు డిస్నీ + హాట్స్టార్ VIP ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తుంది. అలాగే ఎయిర్టెల్ నుండి వచ్చిన ఇతర రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ లు ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి వాటికీ ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తాయి.

 

OTT ప్రయోజనాలతో లభించే వోడాఫోన్ ఐడియా ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లు

OTT ప్రయోజనాలతో లభించే వోడాఫోన్ ఐడియా ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లు

వొడాఫోన్ ఐడియా (Vi) నుండి రూ.300 పైన నుండి వచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్లు వినియోగదారులకు Vi మూవీస్ & టివి యాప్‌తో పాటు Zee5 ప్రీమియంను ఉచితంగా అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ లు రోజువారీ డేటాలలో మార్పులను కలిగి ఉంటాయి. ఇవి అన్ని కూడా రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్లలో కొన్నిటికి వీకెండ్ డేటా రోల్ఓవర్ ఆఫర్‌ను కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi Operators Offers These OTT Benefits With Prepaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X