Airtel, Jio,Vi ఆపరేటర్లు తమ ప్లాన్‌లతో అందించే OTT సబ్స్క్రిప్షన్స్ ఉపయోగకరంగా ఉన్నాయా?

|

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా గల తన యొక్క వినియోగదారులకు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లను భారీగానే అందిస్తున్నారు. ప్రస్తుతం OTT యొక్క పెరుగుదల నేరుగా సరసమైన డేటా రేట్లతో అనుసంధానించబడి ఉంటుంది. రిలయన్స్ జియో తన యొక్క నెట్వర్క్ కవరేజ్ ను కూడా పెంచుతున్నది. ఈ రోజు అన్ని ఆపరేటర్లు డిస్నీ + హాట్‌స్టార్, ZEE5 ప్రీమియం వంటి మరిన్ని OTT ప్రయోజనాలతో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. ఈ OTT లు మీకు ఎంతవరకు విలువైనవిగా ఉన్నాయి? ఈ ప్లాన్‌లు ఎంతవరకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OTT యాప్

ప్రస్తుతం తరచూ OTT యాప్ లను చూసే వారు వాటి సబ్స్క్రిప్షన్ లను విడిగా కొనుగోలు చేయడం కాకుండా OTT ప్రయోజనాలతో వచ్చే ప్లాన్లను కొనుగోలు చేయడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కేవలం వాయిస్ కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను మాత్రమే కోరుకునే వినియోగదారులకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేయడం అనేది అర్ధవంతం కాదు.

డిస్నీ + హాట్‌స్టార్ VIP

వినియోగదారులు చాలా సందర్భాలలో తమకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రోత్సహించబడతారు. వీటిలో మునుపు స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర గాడ్జెట్‌లు ఉండగా ఇప్పుడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు వాటికి సమానంగా ఉంటుంది. ఉదాహరణకు డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క OTT సభ్యత్వాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం నిజంగా లేని వినియోగదారులు సంస్థ యొక్క మార్కెటింగ్ వ్యూహాల కారణంగా ఈ సభ్యత్వంతో వచ్చే ప్లాన్ ను కొనుగోలు చేయవలసి వస్తుంది. ప్రతి కంపెనీ ఇందుకోసం 'ఉచిత' అనే పదాన్ని అధికంగా ఉపయోగిస్తుంది. ఏ వ్యాపారం కూడా ఎప్పుడూ ఉచితంగా దేనిని ఇవ్వదు అని చాలా మంది ప్రజలు గుర్తించారు. అందుకే ఈ ప్లాన్‌లు ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పినప్పటికీ వాటికి సాధారణ ప్లాన్‌ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

రిలయన్స్ జియో

ఉదాహరణకు రిలయన్స్ జియో నుండి లభించే రూ.777 ప్రీపెయిడ్ ప్లాన్ తన యొక్క వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా (+ 5GB బోనస్ డేటా), ఉచిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS / day ప్రయోజనాన్ని 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అదనంగా డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క OTT ప్రయోజనం ఉచితంగా జోడించబడింది అని సంస్థ తెలుపుతుంది. అయితే ఇది ఉచితం కాదు. ఎందుకంటే మీరు జియో నుండి డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఒక ప్లాన్ ను పొందవచ్చు. టెల్కో నుండి లభించే రూ.555 ప్లాన్ వినియోగదారులకు బోనస్ డేటా మరియు ఒటిటి ప్రయోజనం మినహా మిగిలిన అన్ని రకాల ఖచ్చితమైన ప్రయోజనాలను అందిస్తుంది.

OTT ప్రయోజనాలు విలువైనవిగా ఉన్నాయా?

OTT ప్రయోజనాలు విలువైనవిగా ఉన్నాయా?

సాధారణంగా చెప్పాలంటే మీరు ఏదైనా ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి టెలికాం కంపెనీలు అందించే కుట్ర OTT ఉచిత సబ్స్క్రిప్షన్. మీకు OTT చందా అవసరమైతే అది మంచిది అలా కాకపోతే మీరు OTT సభ్యత్వంతో కూడిన ప్లాన్లను కొనుగోలు చేయవలసి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆపరేటర్ల మార్కెటింగ్ వ్యూహాలకు లోబడినట్లు అవుతుంది. OTT సబ్స్క్రిప్షన్ అనేది మీకు అవసరం లేకపోతే ఎందుకు కొనాలి? ఎంత మంచి ఒప్పందంగా ఉన్నప్పటికీ మీకు అవసరం లేనిదాన్ని మీరు కొనుగోలు చేస్తే కనుక మీరు మీ డబ్బును వృధా చేస్తున్నారు. ఇది OTT ప్రయోజనాలతో సమానంగా ఉంటుంది. మీకు ఇది అవసరం లేకపోతే ఉచిత సభ్యత్వంతో వచ్చే ప్రణాళికను తీసుకోవాల్సిన అవసరం లేదు.

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi Operators Provides OTT Subscriptions With Their Plans Really Useful?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X