Amazon Prime సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్న ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్యాక్‌లు...
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇండియాలో ఇప్పుడు మొదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం అమ్మకాలు నిన్నటి నుండి మొదలుకాగా ప్రైమ్ కాని వినియోగదారుల కోసం అమ్మకాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ప్రైమ్ సభ్యత్వాన్నీ సాధారణంగా సంవత్సరానికి రూ.999 ధర వద్ద పొందవలసి ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు ఒకటి లేదా రెండు రోజులలో ఉచిత డెలివరీ వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ వంటి ప్రైమ్ ఎకోసిస్టమ్‌కు కూడా అదనంగా యాక్సిస్ లభిస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్‌ను వినియోగదారులకు ఉచితంగా అందించే ముఖ్యమైన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్యాక్‌లు ఉన్నాయి. వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ యొక్క ప్రయోజనాన్ని జియో, ఎయిర్‌టెల్ మరియు VI యొక్క ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్యాక్‌ల నుండి ఎంచుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ యొక్క ప్రయోజనంను ఏ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు అందిస్తాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్
అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంను ఎయిర్‌టెల్ యొక్క రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్రయోజనంను అందించే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ తో వినియోగదారులు 2GB రోజువారీ ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో పొందుతారు. అమెజాన్ ప్రైమ్ చందా యొక్క చెల్లుబాటు కూడా 28 రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్ వంటి ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో ఇతర టెలికం ఆపరేటర్లు ఎవరూ తమ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించరు. అయితే ఆపరేటర్లు తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అమెజాన్ ప్రైమ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారులకు ఐదు వేర్వేరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. కానీ వాటిలో అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాన్ని నాలుగు ప్లాన్లు అందిస్తున్నాయి. రూ.499 ప్లాన్ 75GB డేటాతో వస్తుంది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్ మరియు అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక సంవత్సరం సభ్యత్వాన్ని అందిస్తుంది. ప్రైమ్ బెనిఫిట్‌తో దాని ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో పాటు ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంకా రూ .749, రూ .999, రూ .1,599 తో సహా మిగతా ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ యొక్క ‘ఒక సంవత్సరం' చందాను ఉచితంగా అందిస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
భారతదేశంలోని అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్ అయిన జియో అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాన్ని ఐదు ప్లాన్‌లతో అందిస్తుంది. రూ.399 ధర వద్ద లభించే ప్లాన్ 75GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, అన్‌లిమిటెడ్ SMS, 200GB డేటా రోల్‌ఓవర్ సదుపాయం ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక సంవత్సరం చందాతో పాటు జియో యొక్క అన్ని రకాల యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది. ఇంకా ఆపరేటర్ నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్ ను అందించే జియో యొక్క మరో నాలుగు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలు రూ.599, రూ .799, రూ .999 మరియు రూ .1499 ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో VI పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా (Vi) కూడా తన వినియోగదారులకు మూడు ‘వ్యక్తిగత' పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తున్నది. రూ.499 ధర వద్ద లభించే బేస్ ప్లాన్ వినియోగదారులకు 75GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ లో ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ యొక్క ప్రయోజనం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్ పొందే ఇతర ప్లాన్‌లలో రూ.699 మరియు రూ.1099 రెడ్‌ఎక్స్ ప్లాన్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








