Airtel, Jio, Vi టెల్కోలు ప్రీపెయిడ్ టారిఫ్‌లను మరోసారి పెంచనున్నాయి!!

|

భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) మరియు భారతి ఎయిర్‌టెల్ ఈ సంవత్సరం 2022 దీపావళి నాటికి తమ యొక్క ప్రీపెయిడ్ టారిఫ్‌లను 10% నుండి 12% వరకు పెంచవచ్చు అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే 2022 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి టారిఫ్ పెంపు పొందే అవకాశం రావచ్చు. ఈ టారిఫ్ పెంపుతో ఒక్కో వినియోగదారుడి మీద సగటు ఆదాయం (ARPU) మరో 10% పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. US ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియం ఓ నీల్ & కో యొక్క భారతీయ యూనిట్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ మయూరేష్ జోషి మాట్లాడుతూ టెల్కోలు మరో 10%-12% ప్రీపెయిడ్ టారిఫ్ పెంపునకు వెళతాయని చెప్పారు. భారతి ఎయిర్‌టెల్, జియో మరియు Vi యొక్క ARPU వరుసగా రూ.200, రూ.185 మరియు రూ.135 వద్దకు పెరిగే అవకాశం ఉంది.

ఎయిర్‌టెల్, జియో & Vi కస్టమర్‌ల చేరికలు

ఎయిర్‌టెల్, జియో & Vi కస్టమర్‌ల చేరికలు

భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో సంస్థలకు దేశవ్యాప్తంగా బలమైన 4G నెట్‌వర్క్ ఉన్నందున FY23లో ఎక్కువ మంది కస్టమర్‌లను జోడించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బయట ఉన్న పెట్టుబడిదారుల ద్వారా నిధులను సేకరించేందుకు టెల్కో కష్టపడుతున్నందున చందాదారుల చేరికలో Vi యొక్క పనితీరు ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆపిల్ బ్రాండ్ ఫోన్‌లు Q1 2022లో అధికంగా అమ్ముడైన జాబితాలో మూడు ఉన్నాయి...ఆపిల్ బ్రాండ్ ఫోన్‌లు Q1 2022లో అధికంగా అమ్ముడైన జాబితాలో మూడు ఉన్నాయి...

టారిఫ్ పెంపు

టారిఫ్ పెంపు తరువాత భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల ARPU ప్రారంభ ధర రూ.200 లక్ష్యంను చేరుకోవడానికి అనుమతిస్తుంది. కానీ మీడియం-టు-లాంగ్ రన్‌లో ఎయిర్‌టెల్ దాని ARPU రూ.300 స్థాయిని అధిగమించాలని కోరుకుంటోంది. దీని అర్థం రాబోయే రోజులలో మరిన్ని ధరల పెంపుదలలను చూడబోతున్నాం.

ARPU

వోడాఫోన్ ఐడియా కూడా తన యొక్క టారిఫ్ పెంపు వ్యూహంలో ఎయిర్‌టెల్‌ను అనుసరిస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌టెల్ ఎంత మొత్తంలో టారిఫ్‌లను పెంచుతుందో అంతే మొత్తంతో Vi టెల్కో కూడా పెంచే ప్రయత్నాలను చేస్తోంది. ఈ సంవత్సరం మరో ధరల పెంపు తర్వాత కూడా Vi యొక్క ARPU రూ.150ను దాటకపోవచ్చు. ఇది కంపెనీ పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే విషయం. టెల్కో యొక్క 2G కస్టమర్లు వారి యొక్క ఆదాయాలను దెబ్బతీస్తున్నారు. మరింత ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి మరియు మెరుగైన ఆదాయాల కోసం Vi లెగసీ నెట్‌వర్క్ వినియోగదారులను దాని 4G సేవలకు అప్‌గ్రేడ్ చేయడానికి పుష్ చేయాలి.

TRAI

ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు ఊహించని బహుమతిగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అది కూడా ఒక నెల పూర్తి చెల్లుబాటుతో. టెల్కో యొక్క కొత్త ప్లాన్లు రెగ్యులేటర్ TRAI యొక్క ఆర్డర్‌కు అనుగుణంగా వస్తుంది. దీని ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉండాలి. ఎయిర్‌టెల్ యొక్క ప్రత్యర్థి జియో కూడా ఇటీవల రూ.296 మరియు రూ.259 ధర వద్ద 1-నెల పూర్తి వాలిడిటీతో వచ్చే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా లేదా Vi కూడా నెలవారీ చెల్లుబాటుతో రూ.337 మరియు రూ.327 వద్ద రెండు ప్లాన్‌లను అందిస్తోంది.

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi Telcos to Hikes Up to 10% to 12% Prepaid Tariffs Once Again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X