ఇండియాలో 5G స్మార్ట్‌ఫోన్‌ల లభ్యత గురించి ఆందోళన చెందుతున్న టెల్కోలు!! కారణం ఏమిటో

|

ఇండియాలోని మూడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు వోడాఫోన్ ఐడియా(Vi), రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు దేశంలో 5G స్మార్ట్‌ఫోన్‌ల లభ్యత తగ్గడం గురించి కొంచెం ఆందోళన చెందుతున్నాయి. భారత ప్రభుత్వం 5G మొబైల్‌ని స్థానికంగా పరీక్షించి వాటిని భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు జనవరి 1, 2023 నుండి వాటిని సురక్షితంగా ఉందొ లేదో అని ధృవీకరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ప్రైవేట్ టెల్కోలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)కి ఈ చర్య వల్ల డేటా వినియోగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మరియు చివరికి భారతీయ వినియోగదారులకు తాజా 5G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడాన్ని దూరం చేస్తుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఇటువంటి చర్యలతో ప్రపంచం మొతానికి స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసే తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ దృష్టికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

5G స్మార్ట్‌ఫోన్‌ల ధృవీకరణ & పరీక్షను కోరుతున్న TEC

5G స్మార్ట్‌ఫోన్‌ల ధృవీకరణ & పరీక్షను కోరుతున్న TEC

ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో టెలికాం ఇంజినీరింగ్ సెంటర్ (TEC) తప్పనిసరిగా టెలికాం పరికరాల (MTCTE) పాలన యొక్క పరీక్ష మరియు ధృవీకరణ కోసం పిలుపునిచ్చింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. భారతీయ వినియోగదారులకు విక్రయించే ముందు అన్ని స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ కెమెరాలను అన్నిటిని కూడా పరీక్షించి ధృవీకరించమని ఇంతకు ముందు కోరింది. గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) మరియు అలాగే టెలికాం ఆపరేటర్లు 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం అలాంటి చర్యను కొనసాగించవద్దని DoTని కోరారు.

కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌

భారతదేశంలో లాంచ్ అవుతున్న కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను స్థానికంగా పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మార్కెట్లో 5G స్మార్ట్‌ఫోన్ లభ్యత బాగా తగ్గే అవకాశం అధికంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో జోక్యం చేసుకోవద్దని టెల్కోలు మరియు OEMలు DoT మరియు TECలను కోరాయి.

OEMల
 

ఇటువంటి నియమం ఉత్పత్తిని లాంచ్ చేయడానికి OEMల వ్యయ భారాన్ని పెంచుతుంది. అంతేకాకుండా దేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించడంలో మొబైల్ కంపెనీలకు గణనీయమైన జాప్యాన్ని కలిగిస్తుంది. నెట్‌వర్క్ కనెక్టివిటీకి మద్దతు ఉన్న సాంకేతిక పరికరాల పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. TEC యొక్క ఈ నిర్ణయం భారతీయులను సురక్షితంగా ఉంచడానికి వస్తుంది కానీ ఇందుకోసం వినియోగించే ఖర్చు విలువైనది కాదు.

5G స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు

5G స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చి చాలా కాలం అయ్యింది. భారతదేశంలో 5G నెట్‌వర్క్ ఇప్పటికీ అందుబాటులోకి రానప్పటికీ చాలా స్మార్ట్‌ఫోన్‌లు 5Gకి సిద్ధంగా ఉన్న టెక్నాలజీలతో వస్తున్నాయి. మొదటిసారిగా 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 4G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను అధిగమించాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం జనవరి 2022 నెలలో ప్రపంచవ్యాప్తంగా 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 51% అమ్మకాలను చేరుకున్నాయని పేర్కొంటూ ఒక నివేదికను విడుదల చేసింది. కొత్తగా వచ్చిన నివేదికల ప్రకారం చైనా, ఉత్తర అమెరికా మరియు పశ్చిమ ఐరోపా దేశాలు ఈ వృద్ధికి అతిపెద్ద డ్రైవర్లుగా ఉన్నాయి. ప్రపంచంలోనే 5G వ్యాప్తిలో చైనా అగ్రగామిగా ఉంది. జనవరి నెలలో దేశంలో 84 శాతం 5G స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. 5G కోసం ఈ కొత్త పుష్ చైనీస్ టెలికాం ఆపరేటర్‌ల నుండి వచ్చిందని వినియోగదారులకు పోటీ ధరతో 5G స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేయడానికి OEMల సంసిద్ధతతో కలిపి వచ్చిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi Telcos Worried About Availability of 5G Smartphones in India: Here are The Reason

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X