Home
News

IPL 2022 కోసం ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

IPL 2022 సీజన్ సమీపిస్తున్న సందర్భంగా క్రికెట్‌ ప్రేమికులు చాలా మంది ఉత్సహంగా ఉన్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా IPL 2022 సీజన్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానున్నది. IPL క్రికెట్ మ్యాచ్ లను చూడడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా అన్ని మ్యాచ్ లను మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా మంది వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌కు సభ్యత్వాన్ని పొందాలని చూస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు వాస్తవానికి వారి ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఈ OTT ప్లాట్‌ఫారమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను బండిల్ చేస్తారు. డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్‌ను అందించే జియో, Airtel మరియు Vi యొక్క ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో టెల్కో తన యొక్క వినియోగదారులకు 28 రోజుల వాలిడిటీతో రూ.601 ధర వద్ద అందించే ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 3GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజువారీ 3GB డేటాతో పాటు అదనంగా 6GB డేటాను కూడా అందిస్తుంది. అలాగే జియో సంస్థ రూ.499 ధర వద్ద మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు 100SMS/రోజుకు ప్రయోజనాలను అందిస్తుంది. జియో నుండి పేర్కొన్న రెండు ప్లాన్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కి ఒక సంవత్సరం పాటు యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తుంది. అలాగే వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి మరిన్ని జియో అప్లికేషన్‌లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అంతేకాకుండా రోజువారీ డేటా పరిమితిని ఉపయోగించిన తర్వాత వినియోగదారులు 64 Kbps ఇంటర్నెట్ వేగాన్ని మరింత ఆనందించవచ్చు.

వోడాఫోన్ ఐడియా డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

మరోవైపు వోడాఫోన్ ఐడియా కూడా రూ.601 ధర వద్ద అందించే ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ కి ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. Vi యొక్క రూ.601 ప్లాన్ వినియోగదారులకు రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత కాలింగ్‌తో పాటుగా రోజుకు 3GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.901 ధరతో అందించే మరొక ప్లాన్ 70 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMSలతో పాటు నిజమైన అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. బండిల్ చేయబడిన OTT ప్లాట్‌ఫారమ్‌ల విషయానికి వస్తే టెల్కో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌తో పాటు జియో లాగానే ఒక సంవత్సరం యాక్సెస్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు వరుసగా రూ.601 మరియు రూ.901 ప్లాన్‌లతో అదనంగా 16GB మరియు 48GB డేటాను పొందుతారు.

ఎయిర్‌టెల్ - డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ - డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

భారతదేశం యొక్క అత్యంత ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు అందించే డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌ల గురించి విషయానికి వస్తే ముందుగా "ట్రూలీ అన్‌లిమిటెడ్" ప్యాక్‌ల విభాగం క్రింద రూ.599 ప్లాన్‌ను అందజేస్తుంది. ఇది మిగతా రెండింటికి దాదాపు సమానమైన ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ ప్లాన్ దాని వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. మరియు ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటు వ్యవధి 28 రోజులు. అంతేకాకుండా వినియోగదారులు రోజుకు మొత్తం 100 SMSలను కూడా పొందుతారు. దీనితో పాటు వినియోగదారులు చెల్లుబాటు వ్యవధి వరకు రోజుకు 3GB ఇంటర్నెట్ డేటాను కూడా పొందుతారు. అలాగే Airtel రూ.838 ధర ట్యాగ్‌తో 2GB రోజువారీ డేటా ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది మరియు రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ తన ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఏడాదిపాటు సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌లు మొబైల్ ఎడిషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ట్రయల్ ఆఫర్‌ను కూడా అందిస్తాయి. వినియోగదారులు 30-రోజుల ఉచిత ట్రయల్‌ని పొందుతారు. వారు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు దీన్ని ప్రారంభించవచ్చు. ఈ ప్రయోజనం ఒక్కో వినియోగదారుకు ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా వినియోగదారులు షాన్ అకాడమీ, వింక్ మ్యూజిక్‌తో ఉచిత కోర్సులు మరియు మరెన్నో ఉచితంగా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi These Prepaid Plans Comes With Free Disney + Hotstar Subscription For IPL 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X