Airtel, Jio, Vi యూజర్లు అధికంగా ఇష్టపడే ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!!
భారతదేశంలోని ప్రధాన టెలికం ఆపరేటర్లయిన ఎయిర్టెల్, జియో, మరియు వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు తన యొక్క వినియోగదారులకు వేర్వేరు ధరల వద్ద అనేక ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. సాధారణంగా వీటిలో జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ చౌకైనదిగా పరిగణించబడుతుంది. అయితే వోడాఫోన్ ఐడియా యొక్క ప్లాన్ లు అత్యంత ఖరీదైనవిగా పరిగణించబడతాయి.

ఎయిర్టెల్ యొక్క ప్లాన్ల ధరల విషయంలో రెండు ఆపరేటర్ల మధ్య ధరలను కలిగి ఉంటాయి. ఈ టెలికాం సంస్థల నుండి లభించే ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలు మరియు ప్రయోజనాల నిష్పత్తిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమైనది మరియు మెరుగైన జాబితా ప్లాన్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు
భారతి ఎయిర్‌టెల్ తన యొక్క యూజర్లకు ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ.19 నుంచి రూ.2,698 వరకు అందిస్తుంది. టెల్కో నుండి వచ్చిన ఉత్తమ విలువ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.399, రూ.598, మరియు రూ.698 ధరల వద్ద ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS లు, మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో సహా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను అందిస్తున్నాయని గమనించండి.
రూ.399 మరియు రూ.598 రెండు ప్లాన్‌లు వినియోగదారులకు 1.5GB డైలీ ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాను అందిస్తుండగా రూ.698 ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో లభించగా మిగతా రూ.598, రూ.698 రెండు ప్లాన్లు 84 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్ తో వస్తాయి.

జియో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో పైన పేర్కొన్న ఎయిర్‌టెల్ యొక్క ప్లాన్‌లకు సమానమైన ప్రయోజనాలతో కొన్ని ప్లాన్‌లను అందిస్తుంది. రిలయన్స్ జియో నుండి లభించే ఉత్తమ విలువ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.399, రూ.555, రూ.599 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, మరియు జియో యొక్క అన్ని యాప్‌లకు కాంప్లిమెంటరీ చందాతో వస్తాయి.
రూ.399 మరియు రూ.555 ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 1.5GB FUP డేటాను అందిస్తుండగా రూ.599 ప్లాన్ 2GB డైలీ డేటా ప్రయోజనంతో వస్తుంది. ఇంకా రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో లభించగా రూ.555 మరియు రూ.599 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

వోడాఫోన్ ఐడియా (Vi) ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ తన వినియోగదారులకు వివిధ విభాగాలలో టన్నుల కొద్ది ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే వాటి ధరలకు వ్యతిరేకంగా ఉత్తమ విలువను అందించే కొన్ని ప్లాన్లు రూ.449, రూ.599 మరియు రూ.601 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్లన్నీ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనంతో వస్తాయి. రూ.449 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో పాటు డబుల్ డేటా ఆఫర్ కింద వినియోగదారులకు 4GB డేటాను అందిస్తుంది. రూ.599 ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను 84 రోజుల వాలిడిటీకి, రూ.601 ప్లాన్ 56 రోజుల వాలిడిటీకి రోజుకు 3GB డేటాను అందిస్తుంది.
Vi యొక్క అన్ని ప్రణాళికలు ‘బింగే ఆల్ నైట్' మరియు ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌తో కలిసి లభిస్తాయి. ఇంకా ప్రతి ప్లాన్ వినియోగదారులకు Vi మూవీస్ & టీవీకి ఉచిత యాక్సిస్ ను ఇస్తుంది. రూ.599 ప్లాన్ వినియోగదారులకు 5GB బోనస్ డేటాను కూడా అందిస్తుంది. రూ.601 ప్లాన్ వినియోగదారులకు డిస్నీ + హాట్స్టార్ విఐపికి ఒక సంవత్సరం యాక్సిస్ తో పాటుగా బోనస్ గా 32GB డేటాను అందిస్తుంది.


Click it and Unblock the Notifications