జియోకి చావు దెబ్బ, ఫ్రీగా ఎయిర్‌టెల్ 4జీ ఫీచర్ ఫోన్ !

Written By:

రోజుకో ఆఫర్‌తో టెలికాం రంగాన్ని కుదిపేస్తున్న జియో సంస్థ ఇటీవల ఉచితంగా 4జీ ఫోన్ ఇస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే దీని కోసం రూ. 1500 చెల్లించాలని, మూడేళ్ల తరువాత ఆ డబ్బు వెనక్కు తిరిగిచ్చేస్తామని ప్రకటించిన విషయం కూడా విదితమే. ఈ సందర్భంగా మరో ప్రధాన టెలికం సంస్థ ఎయిర్‌టెల్, జియో ధరకంటే తక్కువకే 4జీ ఫీచర్ ఫోన్ అందించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జియో ఫోన్‌కు పోటీగా ఐడియా ఫోన్ వస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ధర రూ. 1000 ఉంటుందని సమాచారం

ఎయిర్‌టెల్ ఫోన్ ప్రీగా  పొందిన తరువాత నెలకు రూ.100 చొప్పున 12 నెలల పాటు రీఛార్జ్ చేసుకునేలా ఎయిర్ టెల్ చెప్పనుందని సమాచారం. మరో కథనం ప్రకారం ఎయిర్‌టెల్ ఫోన్ ధర రూ. 1000 ఉంటుందని సమాచారం. 

జియో పోటీని తట్టుకోవాలంటే

జియో పోటీని తట్టుకోవాలంటే ఇలాంటి కొత్త ఆఫర్‌లతో వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టెలికం వర్గాలు తెలిపాయి.

మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ లాంటి కంపెనీలతో

ఫోన్ రాడార్ రిపోర్టుల ప్రకారం ఈ ఫోన్ కోసం ఎయిర్‌టెల్ మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ లాంటి కంపెనీలతో జతకట్టనుందని తెలిపింది.

జియో ఫీచర్ ఫోన్ కోసం

జియో ఫీచర్ ఫోన్ కోసం కష్టమర్లు రూ.1500 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని జియో మూడేళ్ల తరువాత రీఫండ్ చేస్తామని తెలిపింది. అయితే దీనిపై కొన్ని కండిషన్లను కూడా పెట్టింది.

దానికన్నా తక్కువలోనే

ఇప్పుడు ఎయిర్‌టెల్ తీసుకురానున్న ఫోన్ ధర దానికన్నా తక్కువలోనే ఉంటుందని సమాచారం. రీఫండ్ విషయంపై స్పష్టత లేదు.

ఐడియా కూడా

ఐడియా కూడా జియోకి ధీటుగా రూ. 2500కే 4జీ ఫీచర్ ఫోన్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు టెలికం కంపెనీల మధ్యనే

ఇక ఈ రెండు టెలికం కంపెనీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel to launch Rs 1000 4G feature phone to take on Reliance Jio? All you need to know read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting