ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లు విడుదల.. విమానాల్లోనూ..!
Airtel International Roaming Plans : ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా ఇటీవలే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లను విడుదల చేసింది. గల్ఫ్ ప్రాంతంలో పర్యటించే భారతీయులకు ఈ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి. రెండు ప్రీపెయిడ్, రెండు పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. అయితే మరో ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ కూడా రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్‌ల ధరలు రూ.2999 మరియు రూ.3999 గా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో భాగంగా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ రెండు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లు 10 మరియు 30 రోజుల వ్యాలిడిటీ ని అందిస్తుంది.

రూ.2999 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీంతోపాటు రోజుకు 100 నిమిషాలు (ఇన్‌కమింగ్ + అవుట్ గోయింగ్) కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీంతోపాటు 20 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులుగా ఉంది.
రూ.3999 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా పోస్ట్‌పెయిడ్ యూజర్‌లు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. మరియు రోజుకు 100 నిమిషాల వరకు (ఇన్‌కమింగ్ + అవుట్‌గోయింగ్) కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీంతోపాటు విమానాల్లోనూ డేటా, కాలింగ్, SMS లను ఉపయోగించుకోవచ్చు.
ఇన్ ఫ్లైట్ రోమింగ్ ప్రయోజనాల్లో భాగంగా 250MB డేటా, 100 నిమిషాల పాటు అవుట్‌గోయింగ్ కాల్స్, 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ వీటిని 24 గంటల్లోగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.
ఈ రెండు రీఛార్జ్ చేసుకున్న యూజర్లు వారి సిమ్ కార్డులను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్నేషనల్ రోమింగ్‌లోకి మారుతుంది. ఈ రెండు ప్లాన్‌లు కేవలం పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వోడాఫోన్ ఐడియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. గల్ఫ్ రిజియన్‌కు వెళ్లే భారతీయ యూజర్లకు ఉపయోగపడతాయి. రూ.1199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్, 150 నిమిషాల వరకు అవుట్ గోయింగ్ (లోకల్, ఇండియా) కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. 2GB డేటాను పొందవచ్చు, ప్రతి SMS కు రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది.
రూ.2388 రోమింగ్ ప్లాన్లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్, 300 నిమిషాల అవుట్ గోయింగ్ (లోకల్ + ఇండియా) కాల్స్ అందిస్తోంది. ఒక్కో SMS కోసం రూ.15 చెల్సించాల్సి ఉంటుంది. 4GB డేటాను పొందవచ్చు. వ్యాలిడిటీ 40 రోజులుగా ఉంటుంది.
Vi పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం రూ.2500 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్, 500 నిమిషాల వరకు అవుట్ గోయింగ్ (లోకల్, ఇండియా) కాల్స్‌ను పొందవచ్చు. ఇన్‌కమింగ్ SMS లు ఉచితం కాగా 20 అవుట్‌గోయింగ్ SMS లను మాత్రమే ఉచితంగా అందిస్తోంది. 4GB డేటాను పొందవచ్చు. వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది.
వోడాఫోన్ ఐడియా రూ.4500 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్, 1000 నిమిషాల వరకు అవుట్ గోయింగ్ (లోకల్, ఇండియా) కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. అన్ని ఇన్‌కమింగ్ SMS లు ఉచితం కాగా 30 అవుట్ గోయింగ్ SMS లు వరకు ఉచితంగా పంపవచ్చు. 8GB డేటాను పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 40 రోజులుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








