మీరు ఎయిర్‌టెల్ యూజరా.. డేటా అవసరం లేదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు ఇవిగో..!
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా ప్రయోజనాలు లేకుండా కేవలం వాయిస్, SMS ల కోసం ప్రత్యక ప్లాన్‌లను తీసుకురావాలని టెల్కోలకు ఆదేశించింది. ఇప్పటికీ 2G లేదా కేవలం ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారికి డేటాతో అవసరం ఉండదు. అయితే చాలా వరకు రీఛార్జ్ ప్లాన్ లు డేటాతో కలిగి అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులకు అవసరం లేని వాటికి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా చూడాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది.
డేటా అవసరం లేని వారి కోసం : ట్రాయ్ ఆదేశాలతో జియో, వోడాఫోన్ ఇప్పటికే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చాయి. మరో ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ (Airtel Voice Only Recharge Plans) కూడా వాయిస్, SMS ప్రయోజనాలతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అయితే ధరలను మరింత సవరించాలని ట్రాయ్ సూచనలు చేసింది. దీంతో కొత్త ప్లాన్ లను ఎయిర్‌టెల్ విడుదల చేసింది.

ట్రాయ్ సూచనలతో కొత్త ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ తొలుత రూ.499, రూ.1959 రీఛార్జ్ ప్లాన్‌లను తొలుత తీసుకొచ్చింది. అయితే రూ.499 ప్లాన్‌లో రూ.30 తగ్గింపు మరియు రూ.1959 ప్లాన్ లో రూ.110 తగ్గింపుతో కొత్తగా రూ.469, రూ.1849 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్ ల పూర్తి వివరాలు.
ఎయిర్‌టెల్ రూ.469, రూ.1849 రీఛార్జ్ ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సహా మొత్తంగా 900 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అదే రూ.1849 రీఛార్జ్ ప్లాన్ తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా 3600 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లలో హలో ట్యూన్స్ సహా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
జియో వాయిస్ రీఛార్జ్ ప్లాన్‌లు :
జియో కూడా ఇటీవల లాంచ్ చేసిన రీఛార్జ్ ప్లాన్ లలో మార్పులు చేసింది. జియో గతంలో రూ.458, రూ.1958 తో రెండు ప్లాన్‌లను తీసుకొచ్చింది. ట్రాయ్ ఆదేశాలతో కొన్ని మార్పులు చేసింది. కొత్తగా రూ.448 రీఛార్జ్ ప్లాన్ తో అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 SMS లను అందిస్తోంది. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
దీంతోపాటు రూ.1748 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు 3600 SMS లను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. మరియు రూ.1958 రీఛార్జ్ ప్లాన్ తో అన్‌లిమిటెడ్ కాలింగ్, 3600 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.
ఫీచర్ ఫోన్‌లు, వృద్ధులు, రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నవారికి ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు అనుకూలంగా ఉన్నాయి. డేటా ఉపయోగించని వారి నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దనే టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనలను టెలికాం సంస్థలు వాయిస్, SMS ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








