హైదరాబాద్‌ వాసులకు ఎయిర్‌టెల్ హైస్సీడ్ ఇంటర్నెట్ సేవలు!

Posted By:

పెద్దమొత్తంలో ఇంటర్నెట్ డేటాను వినియోగించే హైదరాబాద్ వాసులకు శుభవార్త. భాగ్యనగర ప్రజలకు హైస్సీడ్ ఇంటర్నెట్ సర్వీసులను అందించే క్రమంలో ఎయిర్‌టెల్ వీడీఎస్ఎల్ (వెరీ-హై-స్పీడ్ డిజిటల్ సబ్‌స్ర్కైబర్ లైన్) పేరుతో సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా యూజర్ 40ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను అందుకోవచ్చు.

నగరంలో ఎయిర్‌టెల్ ఇప్పటికే 16 ఎంబీపీఎస్ వేగంతో కూడిన డీఎస్ఎల్ బ్రాండ్ బాండ్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన వీడీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను యాజర్‌లకు చేరువచేస్తుంది. వీడీఎస్ఎల్ 40ఎంబీపీఎస్ బ్రాండ్‌బాండ్ ప్లాన్‌లో భాగంగా ప్రస్తుతానికి రెండు నెలవారి ప్లాన్‌లను ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది వాటి వివరాలు:

అల్ట్రాసోనిక్ 3999 ప్లాన్: చెల్లించాల్సిన మొత్తం 3,999. ఈ నెల రోజుల ప్లాన్‌లో భాగంగా ఇంటర్నెట్‌ను 200జీబి డేటా వరకు 40 ఎంబీపీఎస్ వేగంతో వినియోగించుకోవచ్చు. 2000 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇంటర్నెట్ వినియోగం 200జీబిని మించినట్లయితే ఇంటర్నెట్ వేగం 512కేబీపీఎస్‌కు పడిపోతుంది.

హైదరాబాద్‌ వాసులకు ఎయిర్‌టెల్ హైస్సీడ్ ఇంటర్నెట్ సేవలు!

అల్ట్రాసోనిక్ 3299 ప్లాన్: చెల్లించాల్సిన మొత్తం 3,299. ఈ నెల రోజుల ప్లాన్‌లో భాగంగా ఇంటర్నెట్‌ను 100 జీబి డేటా వరకు 40ఎంబీపీఎస్ వేగంతో వినియోగించుకోవచ్చు. 1000 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇంటర్నెట్ వినియోగం 100జీబికి మించినట్లయితే ఇంటర్నెట్ వేగం 512కేబీపీఎస్‌కు పడిపోతుంది.

ఈ సర్వీస్‌ను పొందగోరే వారు ముందుగా రూ.3,099 వెచ్చించి బీటెల్ వీడీఎస్ఎల్ వై-ఫై మోడెమ్‌ను కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot