4జీ సేవలు ప్రారంభం!!

Posted By: Staff

4జీ సేవలు ప్రారంభం!!

దేశంలోనే ప్రధమంగా 4జీ ఆధారిత బ్రాడ్‌బాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఏ) సేవలను మంగళవారం భారతి ఎయిర్‌టెల్ కోల్‌కతాలో లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర కమ్యునికేషన్ల మంత్రి కపిల్ సిబల్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై  హైస్పీడ్ సర్వీసును ఆవిష్కరించారు. దీంతో దేశంలో 4జి సేవలు ప్రారంభించిన తొలి టెలికాం ఆపరేటర్‌గా భారతి ఎయిర్‌టెల్ చరిత్రకెక్కింది. 2జీ, 3జీల తర్వాత వస్తున్న 4జీ సర్వీసు 3జీ సేవల కన్నా పదిరెట్లు వేగవంతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

హై డెఫినిషన్ మొబైల్ టీవీ, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి అధునాతన సేవలు 4జి ద్వారా వినియోగదార్లకు అందుబాటులోకి రానున్నాయి. భారతి ఎయిర్‌టెల్ కోల్‌కతా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక సర్కిళ్లలో బిడబ్ల్యుఏ స్పెక్ట్రమ్ లైసెన్స్‌లు పొందింది. మరో నెలరోజుల్లో కర్నాటకలోనూ 4జి సేవలు ప్రారంభిస్తామని భారతి ఈ సందర్భంగా వెల్లడించింది.

3జీ స్పీడ్‌తో పోలిస్తే 4జీ స్పీడ్ 10 రెట్లు అధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి 3జీ‌ నెట్‌వర్క్ స్పీడ్ 21 ఎంబీపీఎస్‌గా ఉంటే రానున్న 4జీ నెట్‌వర్క్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ పై మాటే. ఈ వేగవంతమైన టెక్నాలజీ ధర కాస్త అధికంగానే ఉంటుంది. 4జీ సర్వీసులను అందించే రేసులో రిలయన్స్ ఇన్ఫోటెల్, బీఎస్ఎన్ఎల్, టికోనా, ఎయిర్‌సెల్, క్వాల్కమ్, ఎమ్ టీఎన్ఎల్ వంటి ప్రముక టెలికాం సంస్థలు ఉన్నాయి. అయితే వీటి సేవలు జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ సహకారంతో మొబైల్ ఫోన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot