పూణేలో ఎయిర్‌టెల్ 4జీ సేవలు ప్రారంభం!

Posted By: Staff

పూణేలో ఎయిర్‌టెల్ 4జీ సేవలు ప్రారంభం!

 

 

ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో 20దేశాలకుపైగా టెలికమ్యూనికేషన్ సేవలను అందిస్తున్న ఎయిర్‌టెల్ పూణేలో పోస్ట్ పెయిడ్ 4జీ సర్వీస్‌లను ప్రారంభించింది. దింతో పూణేవాసులు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుకోనున్నారు. ఈ సర్వీసుల్లో భాగంగా మంత్లీ ఇంకా వీక్లీ చందదారుల కోసం రూ.150, రూ.49 ప్యాక్‌లను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ 4జీ సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి తేనుంది. 4జీ సర్వీసులను ఉపయోగించుకునే వినియోగదారులు ట్రెయిల్ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ బ్రాండ్ టీవీ సేవలను ఉచితంగా పొందనున్నారు.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్… నెలంతా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్!

మొబైల్ యూజర్లు గర్వించదగ్గ నెట్‌వర్క్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎయిర్‌టెల్ సరికొత్త 2జీ జీపీఆర్ఎస్ ఇంటర్నెట్ ప్యాక్‌తో ముందుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ రూ.149 చెల్లించి ‘2జీ జీపీఆర్ఎస్ ఇంటర్నెట్ ప్యాక్’ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డౌన్‌లోడింగ్ ఇంకా వెబ్‌బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ఈ ప్యాక్ యూసేజ్‌లో భాగంగా మొదటి 2జీబి డేటా వరకు సాధారణ స్పీడ్‌తో బ్రౌజింగ్ చేసుకోవచ్చు. యూసేజ్ డేటా 2జీబికి మించిన అనంతరం స్పీడ్ వేగం 40కేబీపీఎస్‌కు పడిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot