‘ఫారిన్ పాస్’ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్
ప్రయివేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ట్రావెలర్స్‌ను ఉద్దేశించి సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రయివేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ట్రావెలర్స్‌ను ఉద్దేశించి సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫారిన్ పాస్ (Foreign Pass) పేరుతో ఈ రీఛార్జ్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి. ప్రీపెయిడ్ కస్టమర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్యాక్స్ ధర రూ.196 నుంచి ప్రారంభమవుతుంది.

ఇన్‌కమ్మింగ్ అలానే అవుట్‌గోయింగ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి..
ఎయిర్‌టెల్ ఫారిన్ పాస్ ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీస్ 20 దేశాల్లో పనిచేస్తుంది. ఈ డేటా ప్యాక్‌లలో భాగంగా ఇన్‌కమ్మింగ్ అలానే అవుట్‌గోయింగ్ కాల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. మొబైల్ డేటా, ఎస్ఎంఎస్ వంటి బెనిఫిట్స్ వర్తించవు. ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్స్‌ను ఉద్దేశించి మూడు సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లను లాంచ్ చేసింది. వాటిలో మొదటి రోమింగ్ ప్యాక్ రూ.196 ధరతో అందుబాటులో ఉంటుంది. ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసరికి 7 రోజులు. 20 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది.

మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా కోనుగోలు చేయవచ్చు..
రెండవ రోమింగ్ ప్యాక్ ధర రూ.296. ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు. 40 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది.మూడవ రోమింగ్ ప్యాక్ ధర రూ.446. ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసరికి 90 రోజులు. 70 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది. ఈ స్పెషల్ రోమింగ్ ప్యాక్‌లను ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

20 దేశాల్లో రోమింగ్ సర్వీస్ సేవలు..
ఈ మూడు ఇంటర్నేషనల్ ప్యాక్స్ పనిచేసే దేశాల వివరాలు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాట్, బంగ్లాదేశ్, సౌది అరేబియా, యూఎస్ఏ, ఖతార్, కువైట్, మలేషియా, సింగపూర్, యూకే, శ్రీలంక, బహ్రెయిన్, చైనా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఫ్రాన్స్, నెథర్లాండ్స్, థాయిల్యాండ్.

తరచూ ప్రయాణించే ట్రావెలర్స్‌కు ఇవి బెస్ట్ ప్యాక్స్..
ఈ దేశాలకు తరచూ ప్రయాణించే ట్రావెలర్స్ ఈ మూడింటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా స్వేదశంలోని తమ కుటుంబ సభ్యులతో సౌకర్యవంతంగా మాట్లాడుకోవచ్చు. ఈ సరికొత్త రోమింగ్ ప్యాక్‌లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణీ వెంకటేషన్ మాట్లాడుతూ ఫారిన్ పాస్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను లాంచ్ చేయటం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. అనుకూలమైన రీతిలో రూపకల్పన చేయబడిన ఈ ప్రీపెయిడ్ ప్యాక్స్ ద్వారా ట్రావెలర్స్ తమ కుటుంబ సభ్యులతో సౌకర్యవంతంగా మాట్లాడుకోవచ్చని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








