Airtel AI Spam Detection ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇవాళ విడుదలైన సర్వీసులు పూర్తి ఉచితం..!
మొబైల్ ఫోన్ వినియోగదారులకు ప్రస్తుతం స్పామ్ కాల్స్ పెనుముప్పుగా మారింది. అనేక మంది వినియోగదారులు ఈ తరహా కాల్స్‌తో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) ముందుకొచ్చింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక వ్యవస్థను ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన టెలికాం నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది.
స్పామ్ కాల్స్ మరియు స్పామ్ మెసెజ్‌లను నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ విధానాన్ని (Airtel AI Based Network Solution For SPAM Detection) ఎయిర్‌టెల్ ఇవాళ విడుదల చేసింది. ఈ వ్యవస్థ స్పామ్ కాల్స్, SMS లపై వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఈ సర్వీస్ ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

స్పామ్ డిటెక్షన్ వ్యవస్థ కోసం ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎటువంటి యాప్ లు మరియు ప్రత్యేకమైన విజ్ఞప్తు లు చేయాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ వెల్లడించింది. పూర్తి ఉచితంగా మరియు ఆటోమేటిక్‌గా తమ యూజర్లు అందరికీ ఈ సేవలు యాక్టివేట్ అవుతాయని తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్పామ్ నియంత్రణ వ్యవస్థ పై ఎయిర్‌టెల్ MD మరియు CEO గోపాల్ విట్టల్ స్పందించారు. AI ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యుషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గత 12 నెలలపాటు పనిచేసినట్లు తెలిపారు. భారత్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌గా అవతరించి, కీలక మైలురాయిని చేరినట్లు తెలిపారు.

ఎయిర్‌టెల్ స్పామ్ డిటెక్షన్ సొల్యుషన్ డ్యూయల్ లేయర్ రక్షణ ను కలిగి ఉంటుందని తెలిపారు. మరియు రెండు స్థాయిల్లో ఫిల్టర్‌లను కలిగి ఉంటుంది. ఒకటి నెట్‌వర్క్ స్థాయిలో, రెండోది ఐటీ సిస్టమ్ స్థాయిలో ఉంటుందని తెలిపారు. ప్రతి కాల్ మరియు SMS ఈ డ్యూయల్ లేయర్ AI షీల్డ్‌ను దాటి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
కేవలం 2 మిల్లీ సెకన్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిర్‌టెల్ సీఈవో విట్టల్ వెల్లడించారు. ప్రతి రోజు 1.5 బిలియన్ SMS మరియు 2.5 బిలియన్ కాల్స్ ప్రాసెస్ చేస్తుందని చెప్పారు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెజిలెన్స్ ఆధారిత వ్యవస్థ ప్రతి రోజు 100 మిలియన్ స్పామ్ కాల్స్ మరియు 3 మిలియన్ స్పామ్ SMS లను గుర్తించినట్లు పేర్కొన్నారు.
దీంతోపాటు ఈ వ్యవస్థ SMSల ద్వారా వచ్చే URL లపైనా అప్రమత్తం చేస్తుందని చెప్పారు. ఇందుకోసం అనుమానాస్పద, హాని చేసే URL లతో కూడిన డేటాబేస్‌ను రూపొందించినట్లు తెలిపారు.ఫలితంగా యూజర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంటుందన్నారు. దీంతోపాటు IMEI నంబర్లలో తరచూ మార్పులను కూడా గమనిస్తుందని పేర్కొంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








