జియో కి పోటీగా కాంబో ప్యాక్‌లు విడుదల చేసిన ఎయిర్టెల్
దీపావళి ఆఫర్‌గా దిగ్గజ టెలికాం కంపెనీలు కొత్త టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ అయిదు కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను ప్రారంభించింది. జియోకు కౌంటర్‌గా వీటిని లాంచ్ చేసింది.
దీపావళి ఆఫర్‌గా దిగ్గజ టెలికాం కంపెనీలు కొత్త టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ అయిదు కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను ప్రారంభించింది. జియోకు కౌంటర్‌గా వీటిని లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ముంబై సర్కిల్‌లో మాత్రమే ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.రిలయన్స్ జియో దీపావళి బొనాంజా, బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్లాన్ ప్రవేశపెట్టిన తర్వాత, ఎయిర్‌టెల్ కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆసక్తికరమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్లను ప్రకటించింది. వీటిని కాంబో రీఛార్జ్ ప్యాక్‌లుగా ప్రవేశపెట్టింది.ఎయిర్టెల్ లాంచ్ చేసిన ప్లాన్స్ ను ఒకసారి పరిశిలిస్తే....

రూ.35 ప్లాన్ :
ఈ రూ.35 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 26.5 రూపాయల టాక్ టైం తో పాటు 100 ఎంబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే.

రూ.65 ప్లాన్:
ఈ రూ.65 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి రూ.55 టాక్‌టైం తో పాటు 200ఎంబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే .

రూ.95 ప్లాన్:
ఈ రూ.95 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 95 రూపాయల టాక్ టైం తో పాటు 500 ఎంబీ డేటా లభిస్తుంది . అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే .

రూ.145 రీఛార్జి ప్యాక్:
ఈ రూ.145 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 145 రూపాయల పూర్తి టాక్ టైం తో పాటూ 1 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 42 రోజులు మాత్రమే .

రూ.245 ప్యాక్ :
ఈ రూ.245 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 245 రూపాయల పూర్తి టాక్ టైం తో పాటూ 2 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 84 రోజులు మాత్రమే .

రూ.419 రీఛార్జి ప్యాక్:
ఈ రూ.419 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి రోజుకు 1.4జీబీ డేటా చొప్పున మొత్తం 105జీబీ ఉచితం గ లభిస్తుంది దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .

ఈ ఆఫర్లు పొందేందుకు యూజర్లు....
ఈ ఆఫర్లు పొందేందుకు యూజర్లు అధికారిక ఎయిర్టెల్ వెబ్‌సైట్‌ను లేదా సమీప రిటైల్ అవులెట్‌ను సందర్శించవచ్చు. అలాగే మై ఎయిర్‌టెల్ ఆప్ ద్వారా ఈ ఆఫర్లు లభ్యం.


Click it and Unblock the Notifications








