జియోకి కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్, మరో కొత్త ప్లాన్‌తో ఎంట్రీ !

Written By:

టెలికాం మార్కెట్లో ఇప్పుడు ధరలు యుద్ధం నడుస్తోంది. రిలయన్స్ జియో మొదలుపెట్టిన ఈ టారిఫ్ వార్ ఇప్పట్లో ముగిసే ఛాయలకు కనపడటం లేదు. జియో ప్రవేశపెట్టిన ప్లాన్లకు కౌంటర్ గా భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ 59 రూపాయలతో ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్‌ జియో ప్లాన్‌ 52 రూపాయలకు డైరెక్ట్‌గా అటాక్‌గా ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జియో నుంచి కొత్తగా 3 చవకైన ప్లాన్లు, ప్లాన్లపై అదిరే డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్‌ 59 రూపాయల ప్లాన్‌ వివరాలు

ప్రీపెయిడ్‌ వినియోగదారులు ఏడు రోజుల పాటు 500 ఎంబీ 3జీ లేదా 4జీ డేటాను ఈ ప్లాన్ ద్వారా వాడుకోవచ్చు. రోజు వారీ వాడకంపై ఎలాంటి పరిమితి లేదు. వారం రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ ఉచితం. ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ లేదు. కేవలం ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఇది అందుబాటులో ఉంటుంది. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్లాన్‌ ఎవరెవరికి అందుబాటులో ఉంటుందో తెలుసుకోవచ్చు.

జియో రూ.52 ప్లాన్‌ వివరాలు

రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన రూ.52 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 1.05 జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా, ఫ్రీగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌, 70 ఎస్‌ఎంఎస్‌ను అందిస్తుంది. ఈ ప్యాక్‌ వాలిడిటీ కూడా 7 రోజులే. అయితే ఈ ప్యాక్‌ కింద రోజుకు 0.15జీబీ డేటా మాత్రమే వాడుకునే వీలుంటుంది.

రూ. 349 ప్లాన్

రూ. 349 ప్లాన్  : రోజుకు 2జిబి డేటా వ్యాలిడిటీ 28 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.
రూ. 448 ప్లాన్
రోజుకు 1 జిబి డేటా వ్యాలిడిటీ 70 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.

పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ..

కాగా ఈ మధ్యనే పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు తమ టీవీ యాప్‌ డౌన్‌లోడ్‌పై ఏడాది పాటు ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌ అంతకముందు కేవలం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Launches New Rs. 59 Prepaid Plan To Counter Jio's Rs. 52 Plan. Details Here More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot