Airtel సూపర్ ఆఫర్.. కేవలం రూ.798కే 189 దేశాల్లో చెల్లుబాటయ్యే అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్..
Airtel Rs 798 IR Pack: విదేశాలకు తక్కువ రోజులు వెళ్తున్నారా? మీకోసమే భారతీ ఎయిర్‌టెల్ ఒక అదిరిపోయే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.798కే 5 రోజుల అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్యాక్‌ను ప్రారంభించింది. చిన్న ట్రిప్‌లకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్యాక్ ఏకంగా 189 దేశాల్లో పనిచేస్తుంది. దీనితో, విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఖర్చుతో కనెక్టివిటీని అందించడంలో ఎయిర్‌టెల్ మరో ముందడుగు వేసింది.
* రూ.798 ప్లాన్‌లో ఏమేం ఉంటాయి..
ఈ కొత్త రూ.798 ప్లాన్ ద్వారా మీకు 5 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 2GB హై-స్పీడ్ డేటా ఉంది. వేగంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. 150 నిమిషాల టాక్ టైమ్ ఉంది. ఈ నిమిషాలను మీరు విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే కాల్స్ (ఇన్‌కమింగ్), మీరు చేసే కాల్స్ (అవుట్‌గోయింగ్), ఇండియాకు చేసే కాల్స్ కోసం వాడుకోవచ్చు.

అలాగే మీకు వచ్చే SMSలకు ఎలాంటి ఛార్జీ ఉండదు. మీరు 20 SMSలను ఉచితంగా పంపవచ్చు. మీరు విదేశాలకు వెళ్లిన తర్వాత, అక్కడి నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి, మొదటిసారి కాల్ చేసినా, SMS పంపినా, లేదా డేటా వాడినా.. అప్పటినుంచి మీ 5 రోజుల వ్యాలిడిటీ మొదలవుతుంది.
* డేటా, కాల్స్ అయిపోతే ఎలా..
ప్యాక్‌లో ఇచ్చిన 2GB డేటా, 150 నిమిషాల టాక్‌టైమ్ లేదా 20 SMSలు అయిపోయాయా? కంగారు పడకండి. ఆ తర్వాత కాల్స్ కోసం నిమిషానికి రూ.10 ఛార్జ్ చేస్తారు. ఒక్కో SMSకు రూ.5 ఛార్జ్ పడుతుంది. డేటా వాటా (2GB) పూర్తయితే, డేటా వాడకం ఆగిపోతుంది.
కానీ, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ (Airtel Thanks app) ద్వారా సులభంగా అదనపు డేటా ప్యాక్‌తో టాప్-అప్ చేసుకోవచ్చు. ఈ అదనపు టాప్-అప్‌లు కూడా మీ అసలు రోమింగ్ ప్యాక్ వ్యాలిడిటీ (5 రోజులు) ముగిసే వరకు పనిచేస్తాయి. దీనివల్ల అనుకోని ఛార్జీల భయం లేకుండా ఉండొచ్చు.
* ఒకే ప్లాన్ 189 దేశాల్లో..
ఈ ప్లాన్ ఏకంగా 189 దేశాల్లో పనిచేస్తుంది. అంటే, మీరు ఏ దేశానికి వెళ్తున్నా సరే, ప్రత్యేకంగా ఆ దేశం కోసం వేరే ప్యాక్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి కంటే ఎక్కువ దేశాలు తిరిగినా, వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో ఉన్నా ఇదే ప్లాన్ పనిచేస్తుంది.
* ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్
అంతేకాదు, విదేశాల్లో మీరు ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వాలి అని మీ అంతట మీరు (మాన్యువల్‌గా) ఎంచుకోవాల్సిన పని కూడా లేదు. ఎయిర్‌టెల్ రోమింగ్ ప్యాక్ ఆయా దేశాల్లోని అన్ని స్థానిక నెట్‌వర్క్‌లతో ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. మీరు విదేశాల్లో ఎంత డేటా వాడారు? ఇంకా ఎన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయి?
ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా మీ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. బిల్లింగ్ వివరాలు తెలుసుకోవచ్చు. అవసరమైతే, అదనపు డేటా లేదా నిమిషాలను యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల, విదేశాల్లో ఉన్నప్పుడు మీ వాడకంపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది.
* చిన్న ట్రిప్‌లకు సౌకర్యం
ఇంతకుముందు, ఎయిర్‌టెల్ రోమింగ్ ప్యాక్‌లు ఎక్కువగా ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ 5-రోజుల ప్లాన్, తక్కువ రోజుల కోసం వ్యాపార పనుల మీద వెళ్లేవారికి, చిన్న వెకేషన్లకు వెళ్లేవారికి, లేదా బంధువులను చూడటానికి త్వరగా వెళ్లి వచ్చేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కేవలం రూ.798కే, దేశాల వారీగా ప్లాన్‌ల గురించి టెన్షన్ పడకుండా, అవసరమైన అన్ని సేవలు ఒకే ప్యాక్‌లో పొందవచ్చు. ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటిసారి అన్‌లిమిటెడ్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications