సింగిల్ అకౌంట్లోనే అన్నీ సర్వీసులు, Airtel తొలి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్

|

దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియాలో తొలి డిజిటల్‌ క్వాడ్-ప్లే ప్లాట్‌ఫామ్‌ 'ఎయిర్‌టెల్‌ హోమ్‌'ను లాంచ్‌ చేసింది. బహుళ ఎయిర్‌టెల్‌ సర్వీసులు వాడే గృహాల్లో కస్టమర్‌ అనుభవాలను సులభతరం చేసేందుకు దీన్ని తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ హోమ్‌ ద్వారా హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌, పోస్టుపెయిడ్‌ మొబైల్‌, డిజిటల్‌ టీవీ అన్నింటినీ మై ఎయిర్‌టెల్‌ యాప్‌పై సింగిల్‌ అకౌంట్‌లో నిర్వహించుకునేలా కంపెనీ తన కస్టమర్లకు అనుమతిస్తుంది.వివిధ ఎయిర్‌టెల్‌ సర్వీసులకు, పలు చెల్లింపు తేదీలు ఉంటాయి. వాటన్నింటిన్నీ గుర్తుంచుకోవాల్సినవసరం లేకుండా ఒకే బిల్లులో అన్ని సర్వీసులకు చెల్లించుకోవచ్చు.ఎయిర్‌టెల్‌ హోమ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలో చూద్దాం.

 

పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా ?పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా ?

స్టెప్ 1

స్టెప్ 1

మై ఎయిర్‌టెల్ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ‘ఎయిర్‌టెల్‌ హోమ్‌' బ్యానర్‌పై క్లిక్‌ చేయాలి.

 స్టెప్ 2

స్టెప్ 2

ప్రైమరీ అకౌంట్‌కు మీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ యాడ్‌ చేసుకోవాలి. యాడ్‌-ఆన్‌ అకౌంట్లగా అన్ని ఇతర ఎయిర్‌టెల్‌ కనెక్షన్లు(ఎయిర్‌టెల్‌ పోస్టుపెయిడ్‌ మొబైల్‌, హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌, డిజిటల్‌ టీవీ)లను యాడ్‌ చేసుకోవాలి.

స్టెప్ 3

స్టెప్ 3

అన్ని అకౌంట్ల ఏకీకృత బిల్లు చెల్లింపులకు అంగీకారం తెలపాలి. ఇప్పుడు మై ఎయిర్‌టెల్‌ హోమ్‌ క్రియేట్‌ అవుతుంది. అన్ని అకౌంట్లను మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో నిర్వహించుకోవచ్చు. కొన్ని క్లిక్స్‌తోనే ఒకే బిల్లులో అన్ని చెల్లింపులు చేసుకోవచ్చు.

కస్టమర్‌ కేర్‌ యాక్సస్‌
 

కస్టమర్‌ కేర్‌ యాక్సస్‌

దీంతో పాటు ప్రీమియం కస్టమర్‌ కేర్‌ యాక్సస్‌ను కూడా ఎయిర్‌టెల్‌ హోమ్‌ యూజర్లు పొందుతున్నారు. ఏకీకృత బిల్లులో 10 శాతం వరకు డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు.

బీటా వెర్షన్‌లో ..

బీటా వెర్షన్‌లో ..

ఎయిర్‌టెల్‌ హోమ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎయిర్‌టెల్‌ హోమ్‌బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వచ్చే కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను ఆవిష్కరించనుంది.

‘వన్‌ హోమ్‌, వన్‌ బిల్లు'

‘వన్‌ హోమ్‌, వన్‌ బిల్లు'

‘వన్‌ హోమ్‌, వన్‌ బిల్లు' అనే బ్యానర్‌తో ఈ సర్వీసులను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ హోమ్‌, ఎయిర్‌టెల్‌ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తొలి ఆవిష్కరణ అని కంపెనీ సీఈవో జార్జ్‌ మతేన్‌ అన్నారు.

Best Mobiles in India

English summary
Airtel launches quad-play platform to manage multiple services More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X